గుమ్మడితో ఆరోగ్యం పదిలం

గుమ్మడితో ఆరోగ్యం పదిలం
x
Highlights

గుమ్మడి కాయ ఇది దిష్టి తగులకుండా ఇంటి గుమ్మం ముందు కడతారు అని అందరికీ తెలుసు.. కానీ ఇది వండితే వచ్చే రుచి గురించి ఈ తరం వారికి ఎవ్వరికీ అంత అవగాహన లేదు.

గుమ్మడి కాయ ఇది దిష్టి తగులకుండా ఇంటి గుమ్మం ముందు కడతారు అని అందరికీ తెలుసు.. కానీ ఇది వండితే వచ్చే రుచి గురించి ఈ తరం వారికి ఎవ్వరికీ అంత అవగాహన లేదు.. గుమ్మడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఇందులో ఉండే కెరొటనాయిడ్స్ , పీచుపదార్ధాలు, పొటాషియం, విటమిన్ సి లతో పాటు జింక్ , ఐరన్ , కాల్షియం , కాపర్ , ఫాస్ఫరస్ వంటి ఖనిజారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

గుండె , ఊపిరితిత్తులు,కిడ్నీల ఆరోగ్యానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లు, స్ట్రోక్‌లు తగ్గడినికి దోహదపడుతుంది. గుమ్మడి లో ఉండే విటమిన్ సి వల్ల మన రక్తంలోని తెల్ల రక్తకనాల వృద్ధికి ఇది తోడ్పడుతుంది.. అందువల్ల శరీరంలో రోగనిరోధక కణాలు శక్తివంతంగా పనిచేస్తాయి. తద్వారా ఏమైనా గాయలు ఏర్పడినా... తొందరగా మనిపోతాయి.

కంటి ఆరోగ్యానికి గుమ్మడి ఎంతగానో సహాయపడుతుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. గుమ్మడి రక్తపోటు తగ్గడంలోనూ సహాయపడుతుంది. పరాలసీస్ ముప్పు తగ్గుతుంది. గుమ్మడిలో ఉండే బెటా కెరొటినా మన చర్మంపై పడే సూర్యకిరణాల ప్రభావం పడకుండా సహజసిద్ధంగా సన్‌ బ్లాక్‌గా పనిచేస్తుంది.

గుమ్మడే కాదు గుమ్మడి గింజల్లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి. చాలా మంది గుమ్మడి తిన అందులోని గింజలను పాడేస్తుంటారు. కానీ గింజల్లోనూ ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలైన అర్థరైటీస్, క్యాన్సర్ వంటి జబ్బులతో పాటు హార్ట్ పేషెంట్లు గుమ్మడి గింజలు తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. వీటిని ప్రతి రోజు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. గుమ్మడి గింజలు డయాబెటీస్‌ను నియంత్రిస్తుంది.. చర్మ సౌందర్యానికి తోడ్పడుతుంది.

వీటిని అధికంగా తీసుకుంటే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. మలబద్దకానికి గురికావాల్సి ఉంటుంది. అందుకే వీటిని తీసుకోవడం అలవాటు చేసుకున్న వారు తప్పనిసరిగా ఎక్కు మొత్తంలో నీటిని తీసుకుంటూ ఉండాలి..అదే విధంగా పండ్లను పండ్ల రసాలను సేవిస్తుండాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories