మామిడి పండ్లతో చాలా ఉపయోగాలు..

మామిడి పండ్లతో చాలా ఉపయోగాలు..
x
Highlights

వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తుంది.. ఈ పండ్లను ఇష్టపడని వారుండరు అని అంటారు. రుచిలో ఈ పండు అమృతంతో సమానం. అందుకే పండ్లలో మామిడి పండు రాజు అని పిలుస్తారు.

వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తుంది.. ఈ పండ్లను ఇష్టపడని వారుండరు అని అంటారు. రుచిలో ఈ పండు అమృతంతో సమానం. అందుకే పండ్లలో మామిడి పండు రాజు అని పిలుస్తారు. ఇది ప్రపంచ ప్రజలను మైమరిపించే రుచి మామిడి సొంతం.. వీటిలో కాల్షియం, విటమిన్ బి లు పుష్కలంగా ఉంటాయి అందుకే వీటిని తినేందుకు మామిడి ప్రియులు ఆసక్తిని కనబరుస్తుంటాయి. మామిడి రుచిలోనే కాదు శరీర సౌందర్యానికి, ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. వివిధ రుచుల్లో ఆకారాల్లో, సైజుల్లో, రంగుల్లో లభించే మామిడి పండ్లలో ఎన్నో రకాల ఔషధగుణాలు , ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ముఖ్యంగా మామిడి పండ్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుందని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లు తినడం వల్ల రొమ్మ , పెద్ద పేగు క్యాన్సర్లు రావని అంటున్నారు. ఇక పాదా పగుళ్ల సమస్యతో బాధ పడే వారు మామిడి జిరుగుకు మూడు ఇంతులు నీళ్లు కలిపి ప్రతి రోజు రసుకోవాలి.. ఇలా చేడయడం వల్ల పగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నిద్ర సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు రాత్రి ఒక మామిడి పండును తింటే చక్కగా నిద్ర పడుతుంది.

మామిడి పండ్లే కాదు... మామిడి పూత ద్వారా కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది. ముఖ్యంగా పంటి నొప్పితో, చిగుళ్ల వాపు సమస్యతో బాధపడేవారు నీటిలో మామిడి పూతను వేసి మరిగించి ఆ నీటిని పుక్కిలించడం ద్వారా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. నీరసంగా ఉన్నవారు మామిడిని ముక్కలుగా చేసుకుని తేనె రాసి రోజ్ వాటర్ కాస్త చల్లి, యిలాచీ పొడిని వేసి తింటే చక్కటి ఫలితం లభిస్తుంది. వడదెబ్బ తగులకుండా ఉండేందుకు పచ్చిమామిడికను తినాలి. పచ్చి మామిడిని కాల్చి గుజ్జు తీసి కాస్త చెక్కెరను చేర్చి రసం చేసి తాగితే ఉపశమనం లభిస్తుంది. కాలిన గాయాలపై కాల్చిన మామిడి ఆకుల బూడిదను రాస్తే గాయం మటుమాయం అవుతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories