Top
logo

జామ పండు చేసే మేలు తెలిస్తే ఖచ్చితంగా రోజూ తింటారు

జామ పండు చేసే మేలు తెలిస్తే ఖచ్చితంగా రోజూ తింటారు
Highlights

పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం రోజూ తీసుకునే అన్ని రకాల పండ్లలో ఎన్నో...

పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం రోజూ తీసుకునే అన్ని రకాల పండ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వాటిలో కొన్నింటికి చాలా రకాల రుగ్మతులను నయం చేసే శక్తి ఉంటుంది. అందులో జామ పండు ముందుంటుంది.

మన పెరట్లో నిత్యం లభించే, అలాగే మార్కెట్‌ లో తక్కువ ధరకే దొరికే జామ పండ్లలో ఎన్నో పోషకాలు ఉన్నా..వాటిని తినడానికి ఎవ్వరూ పెద్దగా ఆసక్తిని చూపించరు. కాని జామ పండు చేసే మేలు తెలిస్తే కనుక ఖచ్చితంగా తిని తీరుతారు. మంచి రుచిని కలిగి ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది జామ. పేదవాడి యాపిల్ గా పేరుపొందిన జామ పండును ప్రతి రోజూ తీసుకోడం వల్ల థైరాయిడ్ నుంచి విముక్తి పొందవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. దీనిని వైద్యుల సైతం నిర్థారించారు. విటమిన్-సి లోపం కారణంగా సంభవించే వ్యాధులను జామపండు నయం చేస్తుందట..దీనిని రోజూ తినడం ద్వారా ఆ వ్యాధులను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే థైరాయిడ్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి జామ మంచి చేస్తుందట. జామ థైరాయిడ్ వ్యాధిని దరిచేరనివ్వదని వైద్యులు చెబుతున్నారు.

జామలో చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జామకాయ రోజూ ఒకటి తింటే చాలు చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలోనూ జామ పండు ఎంతో మేలు చేస్తుంది. అలాగే జామపండులో పీచు పదార్థాలు ఎక్కువ, పిండి పదార్ధాలు తక్కువగా ఉంటాయి. ఇది ఒకటి తింటే చాలు కడుపు నిండుగా అనిపిస్తుంది. జామపండు చెడు కొవ్వును తగ్గించడంతో పాటు బరువును నియంత్రిస్తుంది.

ఒక జామపండు 10 ఆయిల్స్ కి సమానం అందుకే దీనికి పేదవాడి అపిల్ అని పేరువచ్చింది. ఒకప్పుడు సీజన్‌లో మాత్రమే జామపండ్లు లభించేవి..కానీ ఇప్పుడు 365 రోజులు జామ పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి మానవ శరీరానికి ఎంతో మేలు చేసే జామ పండ్లను కచ్చితంగా తిని తీరాల్సిందేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Web Titlehealth benefits of guava it prevents thyroid
Next Story


లైవ్ టీవి