చల్లటి మజ్జిగతో చక్కటి పలితం

చల్లటి మజ్జిగతో చక్కటి పలితం
x
Highlights

ప్రతి రోజు ఉదయం లేవగానే... వేడి వేడి కాఫీనో, టీనో కడుపులో పడాల్సిందే.. లేదంటే ఆ రోజంతా ఏదో అయోమయంగా ఉంటుంది చాలా మందికి... ఒక రకంగా చెప్పాలంటే కాఫీ, టీలు ఒక వ్యసనంగా మారిపోయాయి.

ప్రతి రోజు ఉదయం లేవగానే... వేడి వేడి కాఫీనో, టీనో కడుపులో పడాల్సిందే.. లేదంటే ఆ రోజంతా ఏదో అయోమయంగా ఉంటుంది చాలా మందికి... ఒక రకంగా చెప్పాలంటే కాఫీ, టీలు ఒక వ్యసనంగా మారిపోయాయి. అవి లేకపోతే రోజు గడవదు అన్న పరిస్థితి నెలకొంది. కానీ వాటిని తీసుకోవడం ఎంత తగ్గిస్తే అంత మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం పూట కాఫీ , టీలకు బదులు మజ్జిగ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

ప్రతి రోజు ఉదయం మజ్జిగను తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది. ఎలాంటి సమస్యలు ఏర్పడవు. మరీ ముఖ్యంగా కడుపులో మంట, గ్యాస్, అసిడిటీ, సమస్యలు ఉండవు. తరుచుగా ప్రతీరోజు మజ్జిగను తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు తలెత్తవని నిపుణుల మాట. మజ్జిగను పరగడుపున తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

కడుపులో ఉండే పేగుల్లో పేర్కుపోయిన బ్యాక్టీరియాను తరిమికొట్టడంలో ఎంతో సహాపడుతుంది ఈ మజ్జిగ. ఇక వయస్సు పెరుగుతున్నా కొద్ది ఏర్పడే మలబద్దకం వంటి సమస్యలకు మజ్జిగ చక్కటి పరిష్కార మార్గం. మధుమేహ గ్రస్తులు సైతం. ఈ మజ్జిగను తీసుకోవడం వల్ల చక్కర స్థాయిని నియంత్రించవవచ్చు. స్థూలకాయులు మజ్జిగలో కాస్త మిరియాలు, కరివేపాకు వేసుకుని తాగితే కొవ్వు స్థాయిని తగ్గించుకోవచ్చు.

ముఖ్యంగా వేసవి సమయంలో చాలా మంది డీమైడ్రేషన్‌కు గురవుతారు. అలాంటి వారు నిత్యం మజ్జిగను తీసుకోవడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇక మజ్జిగ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి...ఇది ఒంట్లోని వేడిని తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. మజ్జిగలో కాల్షియం, విటమిన్ బి, పొటాషియం ఉంటాయి. అందువల్ల శరీరంలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ఒక హెవీ బ్లడ్ ప్రెజర్‌ తో బాధపడేవారు క్రమం తప్పకుండా మజ్జిగనుతాగడం వల్ల బీపీ నియంత్రనకు వస్తుంది.

మజ్జిగ ఆరోగ్యానికే కాదు చర్మానికి , శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది. కురులకు మజ్జిగను పట్టింది ఒక అరగంట ఉండి తల స్నానం చేస్తే ఎంతో మృదువైన కురులు మీ సొంతం అవుతాయి. ఇక మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట పాటు ఉంచుకుని ఆ తరువాత స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరం అవుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories