బెల్లం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..!

బెల్లం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..!
x
Highlights

బెల్లం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బెల్లంలో సహజమైన తియ్యదనం ఉంటుంది దీని వల్ల శరీరానికి ఎలాంటి హని ఉండదు.ఇంకా బెల్లంలో...

బెల్లం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బెల్లంలో సహజమైన తియ్యదనం ఉంటుంది దీని వల్ల శరీరానికి ఎలాంటి హని ఉండదు.ఇంకా బెల్లంలో ప్రాణంతక మైన వ్యాధుల బారీన పడకుండా కాపాడే విటమిన్స్ ,మినరల్స్ ఉన్నాయి. బెల్లం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో బెల్లం తినటం ఇంకా మంచిది ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచటం వలన ఈ కాలంలో వచ్చే దగ్గు,జలుబును నివారిస్తుంది మరియు టెంపరేచర్ ను అదుపులో ఉంచుతుంది. బెల్లం మలబద్దకాన్ని నివారిస్తుంది. బెల్లం జీర్ణవ్యవస్ధ ఎంజెమ్ లను ఉత్తేజ పరుస్తాయి. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. విష పదార్ధాలను బయటకు పంపుతుంది.

రోజు ఒక ముక్క బెల్లం తింటే వ్యర్ధాలను బయటకు పంసి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దగ్గు, జలుబు తో బాధ పడేవారు వేడి నీళ్ళలో బెల్లం కలుపుకుని తాగితే తగ్గుతుంది లేదా టీ లో చక్కెరకు బదులు బెల్లం వేసుకుని తాగినా మంచిఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు.బెల్లం లో జింక్,సిలినియయ్ మూలకాలు ఉండటం వల్ల ఇన్ ఫెక్షన్ ల వల్ల డ్యామెజ్ అయిన కణాలను తిరిగి బాగు చేస్తుంది.రక్తంలో హిమగ్లోబిన్ శాతాన్నిపెంచుతుంది. ఎక్కువ కాలుష్యం ఉండే పరిశ్రమలు,బోగ్గు గనులు,గ్రానైట్ ఫాక్య్టరీలలో పని చేసే కార్మికులు రోజు బెల్లం తింటే కాలుష్యం వల్ల వారి ఉపిరితిత్తులలో ఉండే వ్యర్ధాలు తోలగిపోతాయి.

బెల్లం గర్భిణీలకు ఇది చాలా మంచిది. బెల్లంలో అధిక మోతాదులో ఉండే మాంగనీస్ కడుపులో ఉండే ప్రేగులలో ఉండే ఇన్ ఫెక్షన్ లు తగ్గుతాయి.100గ్రా బెల్లంలో 16గ్రా మాంగనీస్ ఉంటుంది.మన శరీరానికి అవసరమైన మాంగనీస్ శాతం మొత్తం బెల్లం నుంచి లబిస్తుంది. రక్తంలో ని టెంపరేజర్ ను అదుపులో ఉంచుతుంది. దీని వలన కడుపు చల్లగా ఉంటుంది.వేసవి కాలంలో బెల్లం పానకం రోజు తాగితే వడదెబ్బలు,కడుపు మంట రాకుండా ఉంటాయి. బెల్లంలో పోటాషియం,సోడియం శరీరంలో ఉండే యాసిడ్స్ లెవల్స్ ను సరి చేసి బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుతాయి. ఆస్తమా,శ్వాసనాళాలు వాపు,శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతి రోజు బోజనం తర్వాత ఒక బెల్లం ముక్క తింటే ఆ సమస్యలు తగ్గుతాయి.

కీళ్ళ నోప్పులు,జాయింట్ నోప్పులు ఉన్నవాళ్ళు పాలలో బెల్లం వేసుకుని తాగితే ఆ నోప్పులు తగ్గుతాయి. ఎముకలు దృడంగా అవుతాయి. లావు తగ్గాలి అనుకునే వారు బెల్లం తింటే మంచిఫలితం ఉంటుంది. బెల్లంలో ఉండే పోటాషియం మెటాబాలిజాన్ని పెంచుతుంది. అంతేకాక బెల్లంలో ఉండే కార్భోహైడ్రేడ్ ఎనర్జీని పెంచుతుంది.బె ల్లంలో సహజ తియ్యదనం వల్ల రక్తంలో చక్కెర స్ధాయిలు వెంటనే పెరగవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories