Curryleaves: కరివేపాకు.. ఆరోగ్య రహస్యాలు

Health Benefits of Curry Leaves
x

Curry లీవ్స్:(ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Curryleaves: శరీరంలో రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో కరివేపాకు కీలకపాత్ర వహిస్తుంది.

Curry leaves: భారతీయ వంటకాల్లో కరివేపాకుది ప్రత్యేక స్థానం. ఏ కూర తాలింపు వేసినా కరివేపాకు వుండాల్సిందే. దాని ప్రత్యేకత అలాంటిది మరి. మంచి సువాసన కలిగి ఆకుపచ్చని రంగులో వుండే కరివేపాకు అందరికీ అందుబాటులోనే వుంటుంది. ఒక్క తాలింపులోనే కాదండి కరివేపాకుతో పొడి, పచ్చడి కూడా చేస్తారు. అంతే కాదండోయ్ అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ మీకు తెలులేండి. కాకపోతే నేటి యువతరం కూరలో కరివేపాకు కనపడితే ఏరి పక్కన పడేసే వారి కోసమే ఈ తప్పన. మరి అస్సలు కరివేపాకులో వుండే ఆరోగ్య రహస్యాలు ఏంటో మన "లైఫ్ స్టైల్"లో తెలుసుకుందాం.

కరివేపాకులో కార్బోహైడ్రేట్స్,పాస్ఫరస్,కాల్షియం,మెగ్నీషియం,అలాగే ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇంకా దీనిలో విటమిన్ ఏ,బి,సి,ఈ లు కూడా అధికంగా ఉంటాయి.

కరివేపాకుని రోజు తీసుకోవటం వలన జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా ఉంటుందో మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని బయటికి పంపిస్తుంది. కరివేపాకు ఎక్కడ వుంటే అక్కడ దోమలు మరియు క్రిమి కీటకాలు ఉండవు. కరివేపాకులో అతి ఎక్కువ ఐరన్ శాతం వుంది. రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు రోజువారీ వంటకాలలో కరివేపాకుని వాడటం చాలా మంచిది. అలాగే 4 నుండి 5 కరివేపాకులు నేరుగా తినటం అలవాటు చేసుకోవటం వలన మధుమేహ వ్యాధిని కొద్దివరకు నియంత్రించుకోవచ్చు.

అధిక బరువుతో బాధపడే వారు రోజూ కరివేపాకుతో తయారు చేసిన కషాయాన్ని తాగుతూ వుంటే బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. కంటి చూపును మెరుగు పర్చడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది కరివేపాకు. అంతే కాకుండా ఒత్తడిని కూడా దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

ఈ కరివేపాకుని ప్రతీ రోజు క్రమం తప్పకుండ ఏదో రకంగా తీసుకోవటం వలన మూత్ర పిండ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ సమస్యతో బాధపడేవారు ఎం చేయాలంటే..ముందుగా కరివేపాకు యొక్క వేరుని తీసుకొని,కొన్ని నీళ్లలో వేసి బాగా మరిగించండి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజూ తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు కరగటంతో పాటు ఇంకా మూత్రపిండాలకు సంబంధించి అనేక సమస్యలు తొలగి పోతాయి.

ఎండాకాలంలో వచ్చే డయేరియా నుండి బయటపడటానికి ఒక టీ స్పూన్ కరివేపాకు పొడిని గ్లాసు మజ్జిగలో కలిపి తాగటం వలన మంచి పలితం ఉంటుంది. అలాగే ప్రతీ రోజూ ఒక స్పూన్ కరివేపాకు పొడికి కొద్దిగా తేనె కలిపి తీసుకోవటం వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

కరివేపాకుకి చుండ్రు ని తగ్గించే గుణం ఉంటుంది. కొన్ని కరివేపాకు ఆకులు, సమానంగా నిమ్మపండు తొక్క,శీకాకాయ,పెసలు తీసుకోవాలి. అలా తీసుకున్న వాటిని అన్ని కలిపి పొడిలాగా గ్రైండ్ చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి. ఇలా నిల్వ చేసుకున్న పొడిని ఒక షాంపూ లాగా వాడుకోవటం వలన వారం రోజుల్లోనే చుండ్రు సమస్య తగ్గుతుంది. కొబ్బరి నూనె కొన్ని కరివేపాకు ఆకులను వేసి ఆకులు నల్లగా మారేంత వరకు చిన్న మంట మీద వేడి చేసి తరువాత వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న నూనెని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని జుట్టుకి వాడుకోవటం వలన జుట్టు పెరుగుదల కు మరియు వెంట్రుకలు తెల్లబడకుండా సహాయపడుతుంది. ఇంకా అనేక ఆరోగ్య ప్రజానాలు కలిగి వుండే కరివేపాకు మరింత ఎక్కవగా ఆహారంలో చేర్చుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories