యాపిల్ తింటే ఆ నొప్పుల నుండి ఉపశమనం..

యాపిల్ తింటే ఆ నొప్పుల నుండి ఉపశమనం..
x
Highlights

యాపిల్ తింటే ఆ నొప్పుల నుండి ఉపశమనం.. యాపిల్ తింటే ఆ నొప్పుల నుండి ఉపశమనం..

యాపిల్.. అనేక పోషకాలు ఈ పండులో ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లన్నింటిలో కంటే ఎక్కువ పోషకాలు యాపిల్ లోనే ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు . అందుకనే రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ పండ్లను తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా న్యుమోనియా వ్యాధి రాకుండా యాపిల్ చేయగలదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

యాపిల్ పండ్లలో ఉండే విటమిన్ సి న్యుమోనియా రాకుండా చూస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం యాపిల్ పండ్లను తినడం వల్ల ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు అంటున్నరు ఆరోగ్య నిపుణులు.

అలాగే రోజుకు ఒక గ్రీన్ యాపిల్ తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. గ్రీన్ యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. కాలేయాన్ని రక్షిస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలా ఈ యాపిల్ పండు చేస్తుంది. చేతులు వణకడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలను.. గ్రీన్ యాపిల్ తో చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
Next Story
More Stories