అంజీరాతో ఆరోగ్యం మెండు..

అంజీరాతో ఆరోగ్యం మెండు..
x
Highlights

అంజీర పండులో ఆరోగ్యం మెండు..ఈ పండులో ఉండే పీచు పదార్ధాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి...కాస్త వగరు, కాస్త తీపి, కాస్త పుల్లగా ఉండే ఈ పండ్లు...

అంజీర పండులో ఆరోగ్యం మెండు..ఈ పండులో ఉండే పీచు పదార్ధాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి...కాస్త వగరు, కాస్త తీపి, కాస్త పుల్లగా ఉండే ఈ పండ్లు పోషకాల గణులు. ఆకర్షణీయమైన రంగుగానీ రూపం కానీ ఈ పండుకు ఉండవు కానీ ఇది చేసే మేలు ఎంతో ఉంది. అందుకే తరచుగా అంజీరా పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో కొవ్వు, పిండిపదార్ధాలు, సోడియం వంటి లవణాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. పాలు త్రాగనివారు ఈ పండ్లనుతీసుకోవడం వల్ల యముకలకు అవసరమైన కాల్షియం ఈ పండ్ల ద్వారా పొందవచ్చు.

రోజులో సుమారు 4 నుంచి 5 అంజీరా పండ్లు తీసుకున్నట్లైతే శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించుకోవచ్చు. అధికంగా తీసుకుంటే అనర్థమేనండోయ్...భరువు పెరిగే అవకాశాలు లేకపోలేదు..అంజీరాలో ఎక్కువ స్థాయిలో పొటాషియం తక్కువ స్థాయిలో సోడియం ఉంటుంది. అందువల్ల బీపీతో బాధపడేవారు కూడా ఈ పండ్లను ఎంచక్కా తీసుకోవచ్చు. ఇక మధుమేహంతో బాధపడేవారికి ఈ పండ్లు దివ్య ఔషధం అనే చెప్పాలి. ఇందులో పీచు పదార్ధాలు అధికంగా ఉండటం వల్ల చక్కెర స్థాయిని అదుపు చేసేందుకు ఇవి ఎంతగానో సహాయపడతాయి. లైంగిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు..పిల్లలు లేనివారు ఈ పండ్లును తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.

కొంత మందికి ఊపిరి పీల్చుకోవడం కష్టతరంగా ఉంటుంది.అలాంటి వారు ఇవి తినడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. శ్వాస మార్గాల్లో కఫం తగ్గి ఎంచక్కా గాలిని పీల్చుకోవచ్చు. అంజీరాను తినడం వల్ల నీరసం తగ్గి కండరాలు శక్తివంతమవుతాయి..అంజీరాలో విటమిన్ ఏ వల్ల కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.. అంజీరా పండ్లలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది..అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల మంచి నిద్ర కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఐరన్ శాతం సమృద్ధిగా ఉన్న అంజీరా పండ్లను తీసుకుంటే రక్తహీనత సమస్యను పారద్రోలవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఈ, కేలు జుట్టు రాలటాన్ని నివారిస్తాయి. మతిమరుపు, అల్జీమర్స్ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా అంజీరా పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. దగ్గు, జ్వరం, అల్సర్ ఉన్నవారు డ్రై అంజీర్ తినడం వల్ల చక్కటి ఫలితం దక్కుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories