
ఆరోగ్యాన్ని ఇచ్చే అన్ని పదార్ధాలు రుచిగా ఉండవు. కానీ అరిటి పండులో రుచితో పాటు మన శరీరానికి ఆరోగ్యపరంగానూ ఎంతగానో మేలు చేసే ఎన్నో పోషకాలు లభిస్తాయి.
ఆరోగ్యాన్ని ఇచ్చే అన్ని పదార్ధాలు రుచిగా ఉండవు. కానీ అరిటి పండులో రుచితో పాటు మన శరీరానికి ఆరోగ్యపరంగానూ ఎంతగానో మేలు చేసే ఎన్నో పోషకాలు లభిస్తాయి. అరటి పంటను నిత్యం తీసుకోవడం వల్ల..బరువును నియంత్రించుకోవచ్చు. అరటిపండులో పీచు, పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి..దీనిని తీసుకోవడం వల్ల మనలోని అతి ఆకలని కంట్రోల్ చేస్తుంది..తద్వారా బరువును తగ్గిస్తుంది. చెక్కర స్థానికి అదుపులో ఉంచుతుంది అరటి పండు...ఇన్సులిన్ ఉత్తత్తికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది....గుండె జబ్బులు రాకుండా అరటి పంటను శరీరాన్ని జాగృతపరుస్తుంది. గుండెలో ఉండే నరాల ఒత్తిడిని తగ్గించి మాములు స్థాయికి తీసుకువస్తుంది.
అరటి పండ్లను తీసుకోవడం వల్ల 40శాతం హార్ట్‌అటాక్ వల్ల సంభవించే మరణాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.అరటిపండులో ఉండే మగ్నీషియమ్..వ్యధినిరోధక శక్తిని మెరుగుపరిచి మనల్ని ఎంతో ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పాటునిస్తుంది. ఇది రక్త హీనతను సైతం పోగొడుతుంది. రక్తహీనత వల్ల శరీరం పాలిపోయినట్లు ఉండటంతో పాటు త్వరగా అలసిపోవడం, ఆక్సీజన్ అందకపోవడం వంటి రుగ్మతులు సంభవిస్తాయి. ఒక అరటి పండు తింటే చాలు...హిమగ్లోబిన్ స్థాయిని మెరుగుపరు్తుంది.. ఎర్ర రక్త కణాలను అధికంగా ఉత్పత్తి అయ్యేందు అటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ..రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని అరటి పండ్లు నియంత్రిస్తాయి..జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. 90నిమిషాల పాటు చేసే వ్యాయామం వల్ల మనకు ఎంత శక్తి లభిస్తుందో...రోజుకు రెండు అరటి పండ్లు తినడం వల్ల అంతే శక్తి లభిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అరటిలో నీటి శాతం కంటే ఘన పదార్ధం అధికంగా ఉంటుంది.. కేవలం పండుగానే కాకుండా నిత్య జీవనశైలిలో ఆహారంగానూ అరటి పండ్లను తీసుకోవచ్చు. 150 గ్రాముల మేక మాంసంలో , సగానికి కోసిన కోడిగుడ్డలులో ఎంత శక్తి ఉంటుందో...ఒక మోస్తారు పొడవున్న అరటిలోనూ అంతే వక్తి ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. . పెరిగే పిల్లలకు వృద్ధులకు, వ్యాధుల నుంచి కోలుకునే వారికి ఇది చక్కటి ఆహారం ..
షుగర్ పేషంట్స్...ఇతర పిండి పదార్ధాలను తీసుకోవడం తగ్గించుకోగలిగితే...అరటి పండును తినడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది..అరటిలో కొవ్వు పదార్ధం చాలా అల్ప మోతాదులో ఉంటుంది. శరీరంలోని విషపదార్ధాలను ఇది చక్కగా తొలగిస్తుంది.పచ్చిఅరటి కాయలు విరోచనాలను... మగ్గిన అరటి పండ్లు మలబద్ధకాన్ని అల్సర్‌ను అరికడతాయి. . డయేరిను తగ్గించడంలో అరటి పండ్లు ఎంతగానో సహాయపడతాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



