Health Tips: బొప్పాయితో ఆరోగ్యం, అనారోగ్యం.. ఈ ఆరోగ్య సమస్యలుంటే తినకూడదు..!

Health and illness with papaya If you have these Health Problems you should not Eat it
x

Health Tips: బొప్పాయితో ఆరోగ్యం, అనారోగ్యం.. ఈ ఆరోగ్య సమస్యలుంటే తినకూడదు..!

Highlights

Health Tips: బొప్పాయి పండు అల్పంగా తింటే ఆరోగ్యం, అధికంగా తింటే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. బొప్పాయి అనేది భారతదేశంలో విస్తృతంగా తినే ఇష్టపడే పండు.

Health Tips: బొప్పాయి పండు అల్పంగా తింటే ఆరోగ్యం, అధికంగా తింటే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. బొప్పాయి అనేది భారతదేశంలో విస్తృతంగా తినే ఇష్టపడే పండు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. దీని గింజలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ప్లేట్‌లెట్స్‌ పడిపోయినప్పుడు బొప్పాయి జ్యూస్‌ తాగితే తొందరగా కోలుకుంటారు. అయితే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఈ పండుకు దూరంగా ఉండాలి. బొప్పాయిలో ఫైబర్, విటమిన్ సి వంటి గొప్ప పోషకాలు ఉన్నప్పటికీ ఈ పండు చాలా మందికి హానికరం. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. కిడ్నీ స్టోన్ రోగులు

బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం కాల్షియంతో కలిస్తే సమస్యలు వస్తాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ఈ పండును తినకూడదు.

2. మందులు వాడే వ్యక్తులు

మీరు బ్లడ్ థినర్ ఔషధం తీసుకుంటుంటే బొప్పాయి హానికరం. తరచుగా గుండె జబ్బులతో బాధపడేవారు ఈ ఔషధాన్ని తీసుకుంటారు. తద్వారా రక్త ప్రసరణలో ఎటువంటి సమస్య ఉండదు. ఈ రోగులు బొప్పాయిని తింటే గాయం కారణంగా రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది.

3. ఆస్తమా రోగులు

మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే బొప్పాయి నుంచి దూరంగా ఉండాలి. ఈ పండులో ఉండే ఎంజైమ్ ఆస్తమా రోగులకు హానికరం.

4. గర్భిణీలు

చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భిణీలు బొప్పాయిని అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది వారికి హానికరం.

5. అలెర్జీలతో బాధపడుతున్న వ్యక్తులు

మీరు అలర్జీ వంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే బొప్పాయిని అస్సలు తినవద్దు. ఎందుకంటే ఇందులో ఉండే పపైన్ మూలకం సమస్యను పెంచుతుంది. మీకు చర్మంలో దురద లేదా మంటలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories