Hair Spray: బొద్దింకలకు చెక్ పెట్టే హెయిర్ స్ప్రే

Hair Spray: హెయిర్ స్ప్రే వల్ల కూడా బొద్దింకలను తరిమి కొట్టొచ్చు అదేలా అంటే

Kranthi
Updated on: 15 May 2021 4:03 PM IST
Hair Spray to Check for Cockroaches
X

హెయిర్ స్ప్రే (ఫైల్ ఇమేజ్)

Hair Spray: బొద్దింకలు...బొద్దింకలు ఇవి మన ఇంట్లో ఒకటీ రెండుతోనే ప్రవేశిస్తాయి. కానీ కొన్ని రోజుల లోపేలే పుంఖాను పుంఖలు పుట్టుకొచ్చేస్తాయి. బొద్దింకలు ఎక్కువగా అటు వేడి ఇటు చల్లదనం ఉన్న ప్రదేశంలో కాకుండా మధ్య లో ఉండే ప్రదేశాలను ఎంచుకుంటాయి. అలానే ఎక్కువగా ఆహారం దొరికే ప్రదేశాలలో అవి ఉంటాయి చాలా మంది బొద్దింకల తో సతమతమవుతూ ఉంటారు. మరి బొద్దింకల బాధ నుండి విముక్తి పొందాలంటే కొన్ని చిట్కాలు మన 'లైఫ్ స్టైల్' లో చూద్దాం.

బొద్దింకల బాధ తొలగిపోవాలంటే ఇళ్లను శుభ్రం చేసుకోండి. అవి ఎక్కువగా ఫుడ్ ఉన్నచోట అంటే మన వంట గది, మరియు దుమ్ము ధూళి ఉన్న ప్రదేశం లో సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు చెత్తని పారేస్తూ వుండాలి. అలానే భోజనం తిన్న వెంటనే ఆ చెత్త ని శుభ్రం చేసేయండి. అలానే తిన్న ప్రదేశంలో కూడా క్లీన్ చేయండి. ఒకవేళ మీరు తర్వాత చూసుకుందాంలే అని అలాగే వదిలేస్తే బొద్దింకలు ఎక్కువై పోతాయి. కాబట్టి పాచి పోయిన ఫుడ్, పాడై పోయిన మొదలైన వాటిని వెంటనే డస్ట్ బిన్ లో వేసేయండి. అలానే డస్ట్ బిన్ ని కూడా వెంట వెంటనే క్లీన్ చేసుకోండి. లేకపోతే బొద్దింకలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇంట్లో కబోర్డ్స ను శుభ్రంగా వుంచుకుంటూ వుండాలి.

హెయిర్ స్ప్రేను తో...

అదేంటి హెయిర్ స్ప్రే ని ఉపయోగించడం అని ఆశ్చర్యపోకండి. నిజమేనండి హెయిర్ స్ప్రే వల్ల కూడా బొద్దింకలను తరిమి కొట్టొచ్చు. దీని కోసం ఏం చేయాలంటే..? బొద్దింక కనపడ గానే దాని మీద హెయిర్ స్ప్రే ని స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల వాటి కాళ్లు చేతులు కదలవు అలాగే వాటి యొక్క రెక్కలను కూడా అవి కదప లేవు. అవి ఎక్కడ ఉంటే అక్కడ అంటుకుపోయి ఉండిపోతాయి. ఆ తర్వాత నెమ్మదిగా అవి చనిపోతాయి. కాబట్టి మీకు బొద్దింక కనపడ గానే దాని మీద కాస్త హెయిర్ స్ప్రే ని స్ప్రే చెయ్యండి. దీంతో మీరు వాటిని చంపవచ్చు. ఒకవేళ మీరు ఇంకా కఠినంగా చంపాలి అంటే మీరు హెయిర్ స్ప్రే ని బొద్దింక మీద స్ప్రే చేసి ఆ తర్వాత వాటిని నలపవచ్చు. ఇలా చేస్తే వెంటనే బొద్దింకలు చనిపోతాయి దీనితో వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది.

Kranthi

Kranthi

Next Story