Weight Loss: గ్రీన్ ‘టీ’ని ఇలా తాగి చూడండి..బరువు ఈజీగా తగ్గిపోతారు


Weight Loss: గ్రీన్ ‘టీ’ని ఇలా తాగి చూడండి..బరువు ఈజీగా తగ్గిపోతారు
Weight Loss: చాలామంది గ్రీన్ తాగుతుంటారు. కానీ బరువు తగ్గడం లేదని తెగ బాధపడుతుంటారు. అయితే ఈ సారి గ్రీన్ ఇలా తాగి చూడండి. బరువు ఈజీగా తగ్గిపోతారు.
Weight Loss: చాలామంది గ్రీన్ తాగుతుంటారు. కానీ బరువు తగ్గడం లేదని తెగ బాధపడుతుంటారు. అయితే ఈ సారి గ్రీన్ ఇలా తాగి చూడండి. బరువు ఈజీగా తగ్గిపోతారు.
ఈ మధ్య కాలంలో గ్రీ టీ తాగుతున్నవారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీని తాగడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఒక నార్మల్ గ్రీన్ టీ ఎన్ని క్యాలరీలను శరీరంలోంచి తగ్గిస్తుంది? దీనికి సరైన సమాధానం ఎవరి దగ్గర ఉండదు. కానీ ఈ గ్రీన్‌లో ఇదిగో ఇలాంటి పదార్దాలు కలుపుకుంటే ఒక నెలలో 3 నుంచి 4 కిలోల బరువు తగ్గిపోతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి అదెలానో చూద్దాం.
ఇంలాంటి సమయంలో తాగాలి..
చాలామంది ఉదయం లేవగానే గ్రీన్ తాగేస్తూ ఉంటారు. కానీ ఉదయం లేచిన తర్వాత అరగంట లేదా గంట తర్వాత మాత్రమే గ్రీన్ టీ తాగాలి. అలా అప్పుడు తాగితేనే మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. అందుకే లేచిన చాలా సేపటికి గ్రీన్ టీ తాగాలి.
గ్రీన్ టీలో ఇవి కలపొద్దు
గ్రీన్ తాగినప్పుడు కాస్త చేదుగా ఉంటుంది. అందుకే చాలా మంది వాటిలో చక్కెర, బెల్లం, తేనె వంటి కొన్ని తీపిపదార్ధాలను కలుపుతారు. కానీ గ్రీన్ టీలో ఇవేమీ కలపకూడదు. వీటిని కలిపితే బరువు తొందరగా తగ్గరు.
ఏవి కలపాలి?
గ్రీన్ అంటేనే ఆకులు అలములతో తయారు చేసిన టీ. కాబట్టి వీటిని మరికొన్ని ఆకులు, కాడలు జోడించి తీసుకోవచ్చు. అంటే గ్రీన్‌లో పుదీనా కాడలు, కరివేపాకు, మందార పువ్వు వంటివి వేసుకుని తాగొచ్చు. అంతేకాదు తాగే ముందు కాస్త నెయ్యి వేసుకుని గ్రీన్ టీ తాగినా మంచిదే. ఇందులో ఉండే బ్యూటైరేట్ అనే ఫ్యాటీ యాసిడ్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.
అయితే వీటితో పాటు రోజూ లంచ్ చేసే ముందు అంటే అరగంట లేదా గంట ముందు గ్రీన్ తాగితే మంచిది. బరువు బాగా తొందరగా తగ్గుతారు. అలాగే దీనితో పాటు ప్రతిరోజూ 30 నిమిషాల వాకింగ్ చేయాలి. ఇది గ్రీ టీ ప్రభావాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే రాత్రి డిన్నర్‌కి ముందు కూడా తాగాలి. అప్పుడు డిన్నర్ చాలా తక్కువ తింటాం. దీంతో రాత్రి సమయంలో గ్రీన్ టీ శరీరంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు, ప్రతిరోజు గ్రీన్ టీ తాగితే విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



