Diabetes: షుగర్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్..ఇకపై శ్వాసంతోనే షుగర్ టెస్ట్

Good news for diabetics Sugar test with just breath
x

Diabetes: షుగర్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్..ఇకపై శ్వాసంతోనే షుగర్ టెస్ట్

Highlights

Diabetes: షుగర్ పేషంట్లలో చక్కెర స్థాయిలను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్ తో పరీక్షించాలి. ఈ ఇబ్బంది లేకుండా కేవలం శ్వాసంతోనే షుగర్ లెవల్స్ ను...

Diabetes: షుగర్ పేషంట్లలో చక్కెర స్థాయిలను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్ తో పరీక్షించాలి. ఈ ఇబ్బంది లేకుండా కేవలం శ్వాసంతోనే షుగర్ లెవల్స్ ను గుర్తించే పరికరాన్ని మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో ఉన్న జటాశంకర్ త్రివేది ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి రూపొందించారు. ఇది సూదిని గుచ్చకుండానే శరీరం నుంచి రక్తం తీయకుండానే షుగర్ లెవల్స్ గుర్తించే పరికరం. ఇందులో శ్వాసను ఊదాల్సి ఉంటుంది. దాన్ని విశ్లేషించి, కొన్ని సెకన్లలో షుగర్ లెవల్స్ ను తెలియజేస్తుంది. ఇది కచ్చితమైన షుగర్ లెవల్స్ ను వెల్లడించినప్పటికీ రీడింగ్ ను మూడు విధాలుగా చూపిస్తుంది. లో అంటే శరీరంలో షుగర్ లెవల్స్ తక్కువ ఉందని..మోడరేట్ అంటే సాధారణంగా ఉందని..హై అని చూపిస్తే ఎక్కువగా ఉందని అర్థం.

2017లొ ఈ ప్రాజెక్ట్ చేయడం ప్రారంభించామని..షుగర్ రోగుల్లో కీటోజెనిక్ జీవక్రియ ప్రారంభమై వారి శరీరం లోపల కీటోన్లు ఏర్పడతాయి. అప్పుడు కీటోన్లలో ఉండే అసిటోన్ వారి శ్వాసలోకి వస్తుంది. అలాంటి పరిస్థితిలో అసిటోన్, గ్లూకోజ్ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశాము. దీని ఆధారంగా ఈ యంత్రాన్ని కనుగొన్నాము. దీనికి 2023లో పేటెంట్ లభించింది. అసిటోన్, గ్లూకోజ్ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసి వాటి నిష్పత్తిని స్పష్టం చేసేందుకు కోడింగ్ చేశాము. తర్వాత రెండింటి మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికి ప్రోగ్రామింగ్ చేశాము. తర్వాత ఇంజనీరింగ్ సహాయంతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యిందని ఈ ప్రాజెక్టులో పాల్గొన్న ప్రొఫెసర్ దుర్గేశ్ అగాసే తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories