Skin Care Tips: వర్షాకాలంలో స్కిన్‌ ఇన్ఫెక్షన్‌లు ఎక్కువ.. ఈ సమస్యలుంటే జాగ్రత్త..!

Get Rid of Rashes and Skin Infections in Monsoon with Home Remedies
x

Skin Care Tips: వర్షాకాలంలో స్కిన్‌ ఇన్ఫెక్షన్‌లు ఎక్కువ.. ఈ సమస్యలుంటే జాగ్రత్త..!

Highlights

Skin Care Tips: వర్షాకాలంలో స్కిన్‌ ఇన్ఫెక్షన్‌లు ఎక్కువ.. ఈ సమస్యలుంటే జాగ్రత్త..!

Skin Care Tips: వర్షాకాలం అందరికి చల్లదనాన్ని అందించడమే కాకుండా ఎన్నో రకాల రోగాలని మోసుకొస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో అతి పెద్ద సమస్య స్కిన్ ఇన్ఫెక్షన్. వర్షాకాలంలో తేమ కారణంగా వచ్చే చెమట, వర్షపు నీరు చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలను సృష్టిస్తాయి. ఈ పరిస్థితిలో వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం.

నిమ్మకాయ, బేకింగ్ సోడా

స్నానం చేయడానికి ముందు ఒక గిన్నెలో రెండు చెంచాల బేకింగ్ సోడా, ఒక చెంచా నిమ్మరసం వేసి పేస్టులా చేయాలి. ఇప్పుడు దీన్ని చర్మమంతా అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత చర్మాన్ని నీటితో కడగాలి. ఇలా రోజూ చేయడం వల్ల దురద నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది.

గంధపు పేస్ట్

గంధం చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. గంధపు పొడిని రోజ్ వాటర్‌లో కలిపి దురద ఉన్న ప్రదేశంలో రాయాలి. కొంత సేపు అలాగే వదిలేయాలి. వర్షాకాలం అంతా ఇలాగే చేస్తూ ఉండండి. దీంతో దురద సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

వేప పేస్టు

వేప చర్మ వ్యాధులకు దివ్యౌషధంగా చెబుతారు. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది అనేక రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని ఉపయోగించాలంటే వేప ఆకులను పేస్ట్‌లా చేసి దురద ఉన్న చోట అప్లై చేసి ఆరిపోయాక నీటితో కడగాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories