Stomach Bloated: వేసవిలో కడుపు ఉబ్బరంగా ఉంటుందా.. ఈ దేశీ జ్యూస్‌లతో ఉపశమనం..!

Get Relief From Bloated Stomach in Summer With These Desi Juices
x

Stomach Bloated: వేసవిలో కడుపు ఉబ్బరంగా ఉంటుందా.. ఈ దేశీ జ్యూస్‌లతో ఉపశమనం..!

Highlights

Stomach Bloated: ఎండాకాలంలో బాక్టీరియా, వైరస్‌ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Stomach Bloated: ఎండాకాలంలో బాక్టీరియా, వైరస్‌ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సీజన్‌లో చాలా మందికి కడుపు ఉబ్బరం , ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే లైట్‌గా తినడం మంచిది. చక్కెర పానీయాలు, జంక్ ఫుడ్స్, భారీ భోజనం ఉబ్బరానికి కారణమవుతాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఉబ్బరం సమస్యను ఎదుర్కోవటానికి కొన్ని ఇంటి చిట్కాలని కూడా పాటించవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

పుదీనా టీ

మీరు కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు పుదీనా టీ తీసుకోవచ్చు. ఇది కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో కడుపు ఉబ్బరం వల్ల ఇబ్బంది పడుతుంటే రోజూ ఒక కప్పు పుదీనా టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

నిమ్మరసం

వేసవిలో నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. కడుపులో గ్యాస్, గుండెల్లో మంట, కడుపు నొప్పి, పుల్లని త్రేనుపుల వంటి సమస్యలని పరిష్కరిస్తుంది.

సెలెరీ పానీయం

ఈ పానీయం చేయడానికి మీకు ఒక గ్లాసు నీరు, పుదీనా ఆకులు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సెలెరీ అవసరం. ఇవన్నీ నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని వడపోసి ఆ తర్వాత తాగాలి. ఇది కడుపు ఉబ్బరం సమస్యని సులువుగా తగ్గిస్తుంది.

పొటాషియం ఆహారాలు

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవచ్చు. కాయధాన్యాలు, అరటిపండ్లు, డ్రై ఫ్రూట్స్, బచ్చలికూర వంటి వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి ఉబ్బరం సమస్యను దూరం చేస్తాయి.

మజ్జిగ

ఎండాకాలం మజ్జిగ కూడా మంచిదే. మధ్యాహ్నం ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. కడుపు ఉబ్బరం సమస్య తగ్గిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories