Garlic: శీతాకాలం ఆరోగ్య సమస్యలకు వెల్లుల్లి దివ్య ఔషధం.. ఎలాగంటే..?

Garlic is a Divine Medicine for Winter Health Problems
x
ఆరోగ్య సమస్యలకు వెల్లుల్లి దివ్య ఔషధం (ఫైల్ ఇమేజ్)
Highlights

Garlic: మనం నిత్యం వంటలలో వాడే వెల్లుల్లిలో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి

Garlic: మనం నిత్యం వంటలలో వాడే వెల్లుల్లిలో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వెల్లుల్లి వంటలకు రుచిని అందించడమే కాదు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ప్రాచీన కాలం నుంచి వెల్లుల్లిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు. ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో అల్లిసిన్, మాంగనీస్, విటమిన్ బీ6, విటమిన్ సీ, సెలినీయం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందుకే శీతాకాలంలో వెల్లుల్లి శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తుంది.

చలికాలంలో వెల్లుల్లిని తినడం వలన జలుబు తగ్గుతుంది. అలాగో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. అలాగే వెల్లుల్లిని తీసుకోవడం వలన ర్కతంలో గ్లూకోజ్ స్థాయి కూడా అదుపులో ఉంటుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడమే కాకుండా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల స్త్రీల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ కంట్రోల్‌లో ఉంటుంది. ఎముకలు దెబ్బతినకుండా సహాయపడుతుంది. దంతాల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

వెల్లుల్లి అంటువ్యాధులు ఇతర వ్యాధులను నయం చేస్తుంది. సైనసైటిస్, జలుబు, ఫ్లూతో పోరాడటానికి సూప్‌లకు వెల్లుల్లిని జోడించవచ్చు. మీరు పచ్చి వెల్లుల్లిని కూడా తినవచ్చు. బరువు తగ్గడానికి వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మీ జీవక్రియను డిటాక్స్ చేయడానికి, వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఉదయం పూట పచ్చి వెల్లుల్లి తేనె తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories