Fruits: పండ్లను ఇంటికి తీసుకొచ్చి అలానే తినేస్తున్నారా? ఇలా చేస్తే.. తొందరలో మీకు భారీగా ఖర్చు తగలొచ్చు


Fruits: పండ్లను ఇంటికి తీసుకొచ్చి అలానే తినేస్తున్నారా? ఇలా చేస్తే.. తొందరలో మీకు భారీగా ఖర్చు తగలొచ్చు
Fruits Cleaning Before Use: పండ్లన కడగకుండా తినకూడదు..అన్న విషయం చాలా మందికి తెలుసు. కానీ కొంతమంది వాటిని శుభ్రం చేయకుండా లేదా సరిగా శుభ్రం చేయకుండా తినేస్తుంటారు.
Fruits Cleaning Before Use: పండ్లన కడగకుండా తినకూడదు..అన్న విషయం చాలా మందికి తెలుసు. కానీ కొంతమంది వాటిని శుభ్రం చేయకుండా లేదా సరిగా శుభ్రం చేయకుండా తినేస్తుంటారు. దీనివల్ల అనారోగాలకు గురవుతుంటారు. అయితే పండ్లన్నీ తింటున్నా ఎందుకు జబ్బులు వస్తున్నాయో తెలియక డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. పండ్లను తినడం ఎంత ముఖ్యమో ఆ పండ్లను ఇంటికి తీసుకొచ్చిన వెంటనే శుభ్రం చేయడం అంతేముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మరి పండ్లను అసలు ఎందుకు, ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు శుభ్రం చేయాలి?
పండ్లపైన పురుగులు మందులు కొడతారు కాబట్టే వాటిని శుభ్రం చేయాలనే చాలామంది అనుకుంటారు. అయితే ఇదొక్కటే పండ్లను శుభ్రం చేయడానికి కారణం కాదు. బయట నుంచి తెచ్చిన పండ్లపై పురుగుల మందుల అవశేషాలు ఉండటమే కాదు వాటిపై బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అలాగే దుమ్ము, ధూళి కణాలు పేరుకుపోయి ఉంటాయి. కలుషిత కణాలు కూడా అంటే ఇతరులు దగ్గి, తుమ్మినప్పుడు పడే వైరస్‌లకు చెందిన కణాలు కూడా పండ్లపై ఉంటాయి. వీటిని నేరుగా తిన్నా లేదా సరిగా శుభ్రం చేయకుండా తిన్నా అంటు వ్యాధులు, ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఎలా శుభ్రం చేయాలి?
పండ్లను శుభ్రం చేసేటప్పుడు ఆ నీరు పండ్లలోపలికి వెళ్లకుండా చూడాలి. అలాగే పండ్ల రంగు కూడా మారకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పండ్లను కడిగేటప్పుడు అవి పగలకూడదు.
తెల్ల వెనిగర్
పండ్లను నీళ్లలో కాస్త తెల్ల వెనిగర్ వేసి అరగంటకు పైనే నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని చేతితో బాగా కడగాలి. మళ్లీ మంచినీటిలో ముంచి కడగాలి. ఇలా చేస్తే వాటిపై ఉండే చెడు కణాలు అన్నీ శుభ్రం అవుతాయి.
అల్లం, నిమ్మ,సోడా ద్రావణం
కొన్ని పండ్లను చూస్తే ఎక్కువగా వాటిపై దుమ్మి ధూళి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు అల్లం, నిమ్మకాయ, కాస్తంత సోడా వీటిని మిక్స్ చేసి నీటిలో వేయాలి. ఈ నీటిలో పండ్లను నానబెట్టి అరగంట లేదా గంట తర్వాత శుభ్రంగా కడగాలి. ఇలా చేస్తే చెడు కణాలు పోయి పండ్లు ఫ్రెష్‌గా తాజాగా కనిపిస్తాయి.
ఉప్పునీళ్లు
ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కాస్తంత ఉప్పు వేసి కలపాలి. ఈ నీటిలో పండ్లను వేసి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత బ్రష్ లేదా చేతులతో పండ్లను శుభ్రంగా కడగాలి. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే పండ్లను కోసిన తర్వాత ఉప్పునీళ్లలో కడగకూడదు అలాగే పగిలిన పండ్లను కూడా కడగకూడదు. ఎందుకంటే పండ్లు ఉప్పు నీటిని పీల్చుకుంటాయి. దీనివల్ల శరీరంలో ఉప్పు స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది.
మంచినీరు
ఇంట్లో పైవేవీ అందుబాటులో లేకపోతే పండ్లను మంచినీటితో శుభ్రం చేసినా సరిపోతుంది. అయితే వీటిని కాసేపు నీటిలో నానబెట్టిన తర్వాత వాటిని బ్రష్‌తోనే కచ్చితంగా శుభ్రం చేయాలి. ఇలా చేస్తే వాటిపైన ఉండే దుమ్ము, బ్యాక్టీరియా అంతా పోతుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



