Antibiotics: పదే పదే యాంటి బయాటిక్స్ వాడితే ఏమవుతుందో తెలుసా ?

Frequent Antibiotic Use Can Endanger Your Immunity Heres How It Works
x

Antibiotics: పదే పదే యాంటి బయాటిక్స్ వాడితే ఏమవుతుందో తెలుసా ?

Highlights

Antibiotics: పదే పదే యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల శరీరం ఇమ్యూనిటీ పై తీవ్ర ప్రభావం పడుతుంది.

Antibiotics: పదే పదే యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల శరీరం ఇమ్యూనిటీ పై తీవ్ర ప్రభావం పడుతుంది. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాను నాశనం చేయడానికి పనిచేస్తాయి. కానీ అవి మన ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. దీనివల్ల మన గట్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ రెండూ దెబ్బతింటాయి. అందుకే డాక్టర్ సూచించినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

వైరల్ ఇన్ఫెక్షన్లకు సాధారణంగా యాంటీబయాటిక్స్ అవసరం లేదు, ఎందుకంటే అవి వైరస్‌లపై పనిచేయవు. కానీ చాలామంది ఈ విషయం తెలియక యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. ఇది మన రోగనిరోధక వ్యవస్థకు చాలా ప్రమాదకరం. మీరు తరచుగా యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు బ్యాక్టీరియాతో పోరాడే మీ శరీర సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. దీనిని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. అంటే, మీకు నిజంగా యాంటీబయాటిక్స్ అవసరమైనప్పుడు అవి పనిచేయవు. ఇది ఇన్‌ఫెక్షన్‌ను మరింత ప్రమాదకరంగా మార్చవచ్చు.

యాంటీబయాటిక్స్ కేవలం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లలో మాత్రమే పనిచేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లలో వాటి ప్రభావం ఉండదు. ప్రజలు సరైన అవగాహన లేకపోవడం వల్ల వైరల్ వ్యాధులకు కూడా యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. దీనివల్ల ఉపయోగం లేకపోగా, మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచే మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు.

యాంటీబయాటిక్స్ వాడకం వల్ల డయేరియా, స్కిన్ అలర్జీలు, కడుపు నొప్పి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. శరీరంలో వాపు, బలహీనతకు కూడా కారణం అవుతుంది. దీర్ఘకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడటం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడి, చిన్న చిన్న అనారోగ్యాలు కూడా తీవ్రమైన వ్యాధులుగా మారవచ్చు. డాక్టర్ సలహా మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలి. వైరల్ జ్వరం లేదా సాధారణ జలుబుకు సొంతంగా మందులు తీసుకోకూడదు. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి, తులసి, అల్లం, పసుపు, నిమ్మకాయ వంటి సహజ పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories