Beauty Tips: పండుగ సీజన్‌లో మెరిసే అందం కోసం ఇవి పాటిస్తే చాలు..!

Follow These Tips for Glowing Beauty This Festive Season
x

Beauty Tips: పండుగ సీజన్‌లో మెరిసే అందం కోసం ఇవి పాటిస్తే చాలు..!

Highlights

Beauty Tips: ఆగస్టు ప్రారంభమైన వెంటనే భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమవుతుంది.

Beauty Tips: ఆగస్టు ప్రారంభమైన వెంటనే భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమవుతుంది. దీపావళి తర్వాత కూడా కొనసాగుతుంది. కాబట్టి ప్రతి మహిళ ఈ పండుగ సీజన్‌లో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాలని పాటించడం వల్ల అందంగా కనిపించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1.బొప్పాయి ఫేస్‌ ప్యాక్

మీరు పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే మీ అందం చెక్కు చెదరకుండా ఉంటుంది. చాలామంది బొప్పాయితో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని కోసం బొప్పాయిలో నారింజ, నిమ్మకాయ, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత నీటితో కడాగాలి. ముఖంలో అద్భుతమైన మెరుపు కనిపిస్తుంది.

2.ఫేషియల్ స్క్రబ్

మీరు పండుగ రోజున అందంగా కనిపించాలనుకుంటే ముందు రోజు రాత్రి స్క్రబ్‌ని ఉపయోగించాలి. దీంతో ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, మట్టి, ధూళి క్లీన్‌ అవుతాయి. ఈ స్క్రబ్‌ను సిద్ధం చేయడానికి బాదంపప్పును పెరుగులో గ్రైండ్ చేసి దానిని ముఖానికి అప్లై చేయాలి. చివరగా చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

3.రోజ్ వాటర్

సాధారణంగా చాలా మంది చర్మం పొడిగా మారుతుంది. దీని కోసం మీరు రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేసే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇది చాలా సహజమైనది, చర్మానికి ఎటువంటి హాని కలిగించదు. ఇందుకోసం రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ముఖానికి అప్లై చేయాలి. దీంతో ముఖం క్లీన్‌గా మారి గ్లో కనిపించడం ప్రారంభమవుతుంది.

4. ఎగ్‌ మాస్

చాలామందిలో ముఖంపై బ్లాక్‌హెడ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని తొలగించాలంటే గుడ్డు మాస్క్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు గుడ్డులోని తెల్లసొనముఖానికి అప్లై చేసి ఆపై శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories