కడుపునిండ తిన్న తర్వాత ఈ విషయాలు మరిచిపోకండి.. లేదంటే ఈ సమస్యలు తప్పవు..?

Follow These Home Remedies After Over Eating
x

కడుపునిండ తిన్న తర్వాత ఈ విషయాలు మరిచిపోకండి.. లేదంటే ఈ సమస్యలు తప్పవు..?

Highlights

Health Tips: కొంతమందికి ఇష్టమైన ఆహారం లభించిందంటే చాలు కడుపునిండా తినేస్తారు. తర్వాత అది జీర్ణంకాక నానా ఇబ్బందులు పడుతారు.

Health Tips: కొంతమందికి ఇష్టమైన ఆహారం లభించిందంటే చాలు కడుపునిండా తినేస్తారు. తర్వాత అది జీర్ణంకాక నానా ఇబ్బందులు పడుతారు. అయితే ఆహారం తినడం తప్పుకాదు కానీ దానిని అరిగించుకోవడం ముఖ్యం. ఇది సరిగ్గా జరగకపోవడంతో చాలామంది రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే మధుమేహం, థైరాయిడ్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అందుకే ఆహారం తిన్నాక ఈ రెమిడీస్‌ పాటిస్తే చక్కటి ఉపశమనం ఉంటుంది. అవేంటో చూద్దాం.

వాకింగ్‌

తిన్న తర్వాత కొద్దిసేపు వాకింగ్‌ చేస్తే చక్కటి ఉపశమనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల అరగంటలో 200 కేలరీలు బర్న్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఉప్పు నీరు

అతిగా తిన్న తర్వాత నల్ల ఉప్పు నీరు తాగాలి. కొన్ని నీటిని వేడి చేసి అందులో నల్ల ఉప్పు, జీలకర్ర, వేసి బాగా కలిపి తిన్న అరగంట తర్వాత తాగాలి. దీని వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా రిలాక్స్‌గా ఉంటారు.

తిన్నతర్వాత కూర్చోవద్దు

తిన్నతర్వాత ఒకేచోట కూర్చోకూడదు. మధ్య మధ్యలో కదులుతూ ఉండాలి. ఇది మీ శరీరాన్ని సక్రియం చేస్తుంది. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే అదనపు కేలరీలను బర్న్ అవుతాయి.

దోసకాయ తింటే మంచిది

ఫైబర్ పుష్కలంగా ఉండే దోసకాయలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతాయి. తిన్న 20 నిమిషాల తర్వాత సగం దోసకాయను తింటే రిలాక్స్‌గా ఫీల్ అవుతారు.

వేడి నీరు

అతిగా తిన్న తర్వాత కడుపులో మంట లేదా అసిడిటీ సమస్య వేధిస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి వేడినీరు తాగితే సరిపోతుంది. కావాలంటే ఈ నీళ్లలో నిమ్మరసం, ఉప్పు కలుపుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories