Top
logo

క్యాన్సర్‌ మహమ్మారికి చేపే మందు అట...

క్యాన్సర్‌ మహమ్మారికి చేపే మందు అట...
X
Highlights

చేపతో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని తరుచూ శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

చేపతో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని తరుచూ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఎన్నోరకాల పోషక విలువలు చేపలలో ఉంటాయి కాబట్టి చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ ఫుడ్ కాలంలో చేపలు తినేవారి సంఖ్య తక్కువనే చెప్పాలి.. చికెన్‌తో లభించే ఫాస్ట్‌ ఫుడ్స్ అందరికీ అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది చికెన్‌ను తీసుకుంటున్నారే తప్ప ఫిష్‌ జోలికి రావడం లేదు..

చేపలు చేసే మేలు పై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం. భారతదేశం చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నా...వాటిని ఆహారంగా తీసుకోవడంలో మాత్రం చాలా వెనుకబడిపోయాము. సంవత్సరానికి సగటున ఒక మనిషి సుమారుగా 17 కేజీల చేపలు తినాల్సి ఉండగా..కేవలం 6 కేజీలకే పరిమితమవుతున్నాడు...అసలు సంవత్సరం పొడవునా తినని వారు కూడా ఉన్నారు.

ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే...చేపలను వారంలో మూడు సార్లు ఆహారంగా తీసుకుంటే..క్యాన్స్‌ర్ కు చెక్క పెట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వారంలో ఒకసారి చేప వంట పదార్ధాలను తీసుకునే వారికంటే.. వారంలో మూడు సార్లు తినే వారిలో పేగు క్యాన్సర్ ముప్పు 12 శాతం తక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా నూనె శాతం ఎక్కువగా ఉండే చేపలకు బదులుగా మిగతా చేపలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ క్యాన్సర్ రీసర్చ్ సెంటర్ సంయుక్తంగా ఈ పరిశోధనలను చేపట్టగా...చేపలో ఉండే కొలెస్ట్రాల్, ఆమ్లాల వల్ల శరీరంలోని వాపు తగ్గుతుందని నిర్ధారించారు. మానవ శరీరంలో వాపు రావడం వల్ల డీఎన్‌ఏ ధ్వంసం అయ్యి క్యాన్స్‌ర్ కు దారితీస్తుందని...కానీ చేపలను తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో చేపలను తరచుగా తినేవారిలో క్యాన్స్‌ర్ ముప్పు ఘనణీయంగా తగ్గినట్లు వెల్లడైంది. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే చేపల వినియోగాన్ని ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Web TitleFish is the best medicine for cancer
Next Story