Yoga: ఒంటరితనం ఫీల్ అవుతున్నారా? అయితే యోగా చేయండి..వేయి ఏనుగుల బలం మీకు వస్తుంది

Yoga: ఒంటరితనం ఫీల్ అవుతున్నారా? అయితే యోగా చేయండి..వేయి ఏనుగుల బలం మీకు వస్తుంది
x
Highlights

Yoga: చాలామంది ఎన్ని ఉన్నా.. ఎంతమంది పక్కన ఉన్నా ఒంటరితనం ఫీల్ అవుతుంటారు. ఎంతమంది ఎంత సపోర్ట్ ఇచ్చినా వాళ్లు అలా ఒంటరిగానే ఉండిపోతుంటారు. ఏదో పొగొట్టుకున్నట్లు, తనకు ఏదీ లేదన్నట్లు ఫీల్ అవుతుంటారు.

Yoga: చాలామంది ఎన్ని ఉన్నా.. ఎంతమంది పక్కన ఉన్నా ఒంటరితనం ఫీల్ అవుతుంటారు. ఎంతమంది ఎంత సపోర్ట్ ఇచ్చినా వాళ్లు అలా ఒంటరిగానే ఉండిపోతుంటారు. ఏదో పొగొట్టుకున్నట్లు, తనకు ఏదీ లేదన్నట్లు ఫీల్ అవుతుంటారు. ఇలాంటి భావనలతో ఉన్నవాళ్లకు యోగా చాలా మంచిదని యోగా నిపుణులు అంటున్నారు. మరి అదేంటో తెలుసుకుందాం.

ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలంటే యోగాలో ఉన్న పెద్ద పెద్ద ఆసనాలే వేయనవసరం లేదు. చిన్న చిన్న ప్రాణయామం, స్లీపింగ్ యోగాలాంటివి చక్కగా చేయొచ్చు. వీటిని ప్రతిరోజూ చేయడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది. మానసికంగా ధృడంగా మారతారు. దీనివల్ల ఒంటరితనం పోయి పదిమందిలో హాయిగా కలిసి తిరుగుతారు.

వార్మ్ అప్

యోగా మొదలుపెట్టే ముందు వార్మ్ అప్స్ కచ్చితంగా చేయాలి. వార్మ్ అప్ అంటే యోగా చేయడానికి మీ శరీరాన్ని సిద్దం చేస్తున్నట్లు. తల నుంచి కాళ్ల వేల వరకు ఉన్న జాయింట్స్ ని రిలీజ్ చేయాలి. అంటే తల భాగాని కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి తిప్పాలి. అలాగే మెడను తిప్పుతూ కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి తిప్పాలి. ఇలా భుజాలు, చేతులు, చేతుల వేళ్లు, నడుము, మోకాళ్లు, పాదాలు.. ఇలా అన్నీ కూడా ఒకసారి కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి తిప్పాలి.

ప్రాణయామం

వార్మప్ పూర్తయిన తర్వాత ప్రాణయామం చేయాలి. దీనివల్ల శరీరం, మైండ్ ఆధీనంలోకి వస్తాయి. సింపుల్ ప్రాణయామాలు ప్రతి రోజూ 12 సార్లు చేస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. ప్రసాంతంగా ఒక చోట కూర్చుని ముక్కు రంథ్రాల్లో ఒకదాని మూసి మరొక రంథ్రం నుంచి గాలి పీల్చాలి. మూసిన రంథ్రాని తెరిచి గాలిని వదలాలి. ఇలా రెండు రంథ్రాల నుంచి గాలిని పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఇది ప్రతి రోజూ చేయడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

సూర్యనమస్కారాలు

ప్రతిరోజు వీలైనన్ని సూర్యనమస్కారాలు చేస్తే శరీరం, మైండ్ పూర్తి ఆధీనంలోకి వస్తుంది. సూర్యనమస్కారాలు పూర్తి చేసిన తర్వాత శరీరం చాలా యాక్టివ్‌గా మారుతుంది. ఇదే మెదడును ప్రేరేపిస్తుంది. దీనివల్ల బాడీ, మైండ్ రిలాక్స్ అవుతాయి. అయితే సూర్యనమస్కారాలు ఎవరైనా యోగా తెలిసిన వాళ్ల దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి.

స్లీపింగ్ యోగా

ప్రతిరోజూ యోగాసనాల చివర్లో స్లీపింగ్ యోగా చేయడం చాలా అవసరం. నేలపై వెల్లికిలా పడుకోవాలి. తల నుంచి కాళ్ల వేళ్ల వరకు శరీరాన్ని అంతటినీ రిలాక్స్ చేయాలి. శరీరంలోని భాగాలన్నీ రిలాక్స్ అవ్వాలంటే మీకు మీరే తలను రిలాక్స్ చేశాను...మెడను రిలాక్స్ చేశాను అని మూడు సార్లు అనుకుంటూ అన్ని భాగాలను రిలాక్స్ గా చేసుకుంటూ వెళ్లాలి. ఇలా మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేయడం వల్ల బ్రెయిన్ పూర్తిగా మీ కంట్రోల్‌లోకి వస్తుంది. దీనివల్ల ఎంతో ప్రశాంతతను పొందుతారు. ఒంటరితనంపోయి పదిమందిలో చక్కగా కలిసి తిరుగుతారు.

గమనిక: ఏ ఆసనాలు వేసినా, నేర్చుకోవాలనుకున్నా మంచి యోగా నిపుణులు దగ్గర నేర్చుకుని వేయడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories