ఘాటైన పచ్చిమిర్చితో.. మేలైన లాభాలు

ఘాటైన పచ్చిమిర్చితో.. మేలైన లాభాలు
x
Highlights

నిత్యం వంటల్లో వాడే ఘాటైన పచ్చిమిర్చితో లాభాలు అనేకం. వంటలకు రుచిని అందించడమే కాదు... ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడటంలోనూ ఇది ప్రధాన పాత్రే పోషిస్తుంది....

నిత్యం వంటల్లో వాడే ఘాటైన పచ్చిమిర్చితో లాభాలు అనేకం. వంటలకు రుచిని అందించడమే కాదు... ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడటంలోనూ ఇది ప్రధాన పాత్రే పోషిస్తుంది. పూర్వం ఏ రోగం వచ్చినా ఇంట్లో తీసుకునే ఆహారం నుంచే చికిత్సా విధానాలను అనుసరిస్తుండేవారు.. కానీ కాలం మారింది. వీధికో హాస్పటిల్ వెలసింది.. దీంతో తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా.. టాబ్లెట్‌ల కోసం హాస్పటళ్లకు పరుగులు పెడుతున్న రోజులివి. అందుకే మనం మరచిపోతున్న ఇంటి ఆరోగ్య ఆహార పదార్ధాలతో కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటూ ఉంటే అనారోగ్యం బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనడంలో సందేహమే లేదు.

పచ్చిమిర్చి ఘాటుగా ఉంటుంది. ఇందులో అసలు క్యాలరీలు అంటూ ఉండవు. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను అందింస్తాయన ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ తో బాధపడేవారు రోజు పచ్చిమిర్చి ఆహారంతో కలిపి భుజిస్తే... వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు గుండె సంబంధిత వ్యాధులు దరిచేర వంటున్నారు. పచ్చి మిర్చి లోపల ఉండే తెల్లటి గింజలల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్ధం ఉండటం వల్ల రక్త నాళాల్లోని కొలెస్ట్రాల్‌ను కరిస్తుంది..పేగుల నుంచి కొవ్వును రక్తంలో చేరకుండా చూస్తుందట. ఈ మధ్యకాలంలో మధుమేహంతో చాలా మంది బాధపడుతున్నారు చిన్న వయసు నుంచే ఈ సమస్యతో సతమతమవుతున్నారు. వ్యాధి వచ్చిన తరువాత బాధ పడే కంటే ముందే జాగ్రత్త పడితే మేలు.. అందుకే మిర్చిని రోజూ తీసుకుంటే షుగర్ వ్యాధి దరి చేరదని వైద్యులు చెబుతున్నారు.

హానికారక వ్యాధులనే కాదు... నిత్యం సతమతమయ్యే సమస్యలకు పచ్చిమిర్చి చెక్ పెడుతుంది. కంటి చూపుతో పాటు చర్మంలో కాంతిని వృద్ధి పరుస్తుంది. పొడి చర్మంతో బాధపడేవారికి... విరుగుడైన జిడ్డును మిర్చి కలుగజేస్తుంది. సో పింపుల్స్‌తో బాధ పడేవారు వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.. అంతేకాదు. వయాగ్రాకన్నా ఇది ఎంతో మిన్నగా పనిచేస్తుందంటున్నారు వైద్యులు.

మిరప వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. వాటిని కడుగకుండే.. తీసుకుంటే అన్నే దుష్పరిణామాలు ఉన్నాయి... మిరప సాగు కోసం ఎక్కువమొత్తంలో రసాయనిక ఎరువులను వినియోగిస్తుంటారు.. కాబట్టి... మిరపను వాడుకునే ముందు... ఉప్పు కలిపిన నీళ్లల్లో కాసేపు నానబెడితే.. క్రిమిసంహారక మందుల ప్రభాగం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories