బాదం పప్పును రోజూ తింటే...

బాదం పప్పును రోజూ తింటే...
x
Highlights

పకృతిలో ప్రసదించే ప్రతిదిది ఉపయోగపడేదే. ముఖ్యంగా చెట్ల నుంచి వచ్చే పండ్లు శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. వాటిలో ముఖ్యంగా బాదంపప్పు అరోగ్యానికి చాలా...

పకృతిలో ప్రసదించే ప్రతిదిది ఉపయోగపడేదే. ముఖ్యంగా చెట్ల నుంచి వచ్చే పండ్లు శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. వాటిలో ముఖ్యంగా బాదంపప్పు అరోగ్యానికి చాలా మెలు చేస్తుంది. బాదం గుండెకు చాలా మేలు చేస్తుంది. వాటిలోని విటమిన్-ఇ, రాగి, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలోని బయో యాక్టివ్ మాలిక్యూల్స్ గుండె అరోగ్యాన్ని కాపాడుతాయి. పీచుపదార్థం, ఫైటోస్టిరాల్స్, యాంటి ఆక్సిడెంట్లు బాదంలో ఎక్కువగా ఉంటాయి.అలాగే బాదం పప్పులో కొవ్వు అధికంగానే ఉంటుంది. అది గుండెకు మేలు చేసేవే. అందువల్ల క్రమం తప్పకుండా దాన్ని తినటం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు కలుగుతుంది. సెరటోనిన్‌ హార్మోన్‌ స్థాయిలు పెరగటానికీ బాదం ఉపయోగపడుతుంది. అది నిద్ర బాగా పట్టడానికి తోడ్పడుతుంది.

వాటిలోని పీచు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. రక్తప్రసరణను సైతం మెరుగుపరుస్తుంది. బాదం పప్పులు నానబెట్టి మర్నాడు తింటే జ్ఞాపకశక్తి మెరగవుతోంది ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. కనుక రోజు బాదం పలుకులను తినడానికి ప్రయత్నిచండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories