Health Tips: నలభై దాటినా 25 ఏళ్లుగా కనిపించాలా.. ఈ ఆరోగ్య చిట్కాలు పాటించండి..!

Even if You are Over Forty you Will Look 25 Years old Follow These Health Tips
x

Health Tips: నలభై దాటినా 25 ఏళ్లుగా కనిపించాలా.. ఈ ఆరోగ్య చిట్కాలు పాటించండి..!

Highlights

Health Tips: జీవితంలో ఎప్పుడూ యవ్వనంగా, అందంగా కనిపించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.

Health Tips: జీవితంలో ఎప్పుడూ యవ్వనంగా, అందంగా కనిపించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ ఇది అందరికి సాధ్యం కాదు. మీరు 40 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల లాగా స్లిమ్ గా కనిపించాలంటే ప్రత్యేక నియమాలను పాటించాలి. ఇవి తాగునీటికి సంబంధించినవి విషయాలు. వీటిని అనుసరించడం వల్ల సూపర్‌ ఫిట్‌నెస్‌ను పొందవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

గోరువెచ్చని నీరు

ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీరు తాగాలి. 2-3 గ్లాసుల నీరు తాగడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల పెద్దపేగు శుభ్రంగా తయారవుతుంది. ఇది తేలికగా తాజాగా ఉంటుంది. కడుపుని శుభ్రపరచడం వల్ల అన్ని వ్యాధులు దూరంగా ఉంటాయి. వ్యక్తి ఫిట్‌గా కనిపిస్తాడు.

చల్లని నీరు తాగకూడదు

ఎండాకాలం అయినా చలికాలమైనా ఎప్పుడూ చల్లటి నీరు తాగడం మానేయాలి. నిజానికి మన కడుపు గుణం వేడిగా ఉంటుంది. ఈ పరిస్థితిలో మనం చల్లటి నీటిని తాగినప్పుడు అది పొట్టలోని అంతర్గత వ్యవస్థను చల్లబరుస్తుంది. దీని కారణంగా మెదడు, గుండె కూడా చల్లబడుతాయి. ఇలాంటి స్థితిలో చాలా సార్లు గుండెపోటు లేదా బ్రెయిన్ ఎటాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

తిన్న తర్వాత నీరు తాగవద్దు

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం మానుకోవాలి. దీనికి కారణం మన కడుపు వేడి కొలిమి లాంటిది. ఇది తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి పనిచేస్తుంది. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే కడుపులోని పంచాగ్ని చల్లబడుతుంది. దీని కారణంగా ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నెమ్మదిగా మారుతుంది. భోజనం చేసిన అరగంట తర్వాత నీళ్లు తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories