ఈ ఆహారాలు తింటున్నారా.. ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం..!

Eating Too Much Pizza and Burger Can Lead to These Diseases
x

ఈ ఆహారాలు తింటున్నారా.. ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం..!

Highlights

Health: మీరు బ్రెడ్, పిజ్జా, బర్గర్, ప్యాక్ చేసిన పొటాటో చిప్స్‌ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.

Health: మీరు బ్రెడ్, పిజ్జా, బర్గర్, ప్యాక్ చేసిన పొటాటో చిప్స్‌ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే జంక్ ఫుడ్‌లను నిరంతరం తీసుకోవడం చాలా హానికరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన రోజువారీ ఆహారంలో చేర్చబడిన అనేక ఆహారాలలో క్యాన్సర్, మ్యుటాజెన్ వంటి హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి వ్యాధులను అభివృద్ధి చేస్తాయి. నిజానికి పిజ్జా, బర్గర్‌ల వినియోగం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. దీని కారణంగా శరీరంలో ఇన్సులిన్ అధిక పరిమాణంలో తయారవుతుంది. దీంతో అసాధారణ క్యాన్సర్ కణాలు శరీరంలో అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఈ పరిస్థితిలో మీరు అటువంటి ఆహారాలను తీసుకోకుండా ఉండాలి.

మీరు నిరంతరం పిజ్జా బర్గర్ తింటే అది మీకు చాలా ప్రమాదకరం. హానికరమైన రసాయన పొటాషియం బర్గర్, పిజ్జా బ్రెడ్ వంటి ఆహారాలలో ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా బ్రెడ్ తెల్లగా, మెత్తగా ఉంటుంది. ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ, థైరాయిడ్, కోలన్ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్యాక్ చేసిన చిప్స్ కూడా ఆరోగ్యానికి మంచివి కావు. ఇందులో కొవ్వు, సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. దీంతో పాటు కృత్రిమ రంగు, ప్రిజర్వేటివ్ కలిసి ఉంటాయి. వీటిని నిరంతరం తీసుకోవడం వల్ల అనేక రోగాలు సంభవిస్తాయి.

శుద్ధి చేసిన నూనెను నిరంతరం ఉపయోగించడం వల్ల కూడా శరీరానికి హాని కలుగుతుంది. ఇందులో ట్రైగ్లిజరైడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కాంపౌండ్స్ ఉంటాయి. దీనిని యాసిడ్‌తో శుద్ధి చేస్తారు. అందుకే కనీసం రిఫైన్డ్ ఆయిల్ అయినా వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. శీతల పానీయాలు ఓపెన్‌ చేయగానే వచ్చే నురుగు ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే ఈ ఫోమ్‌లో మెథిగ్లైక్సాల్ వంటి రసాయనాలు ఉంటాయి. శీతల పానీయాల తయారీ సమయంలో దానికి ఫుడ్ కలరింగ్ కూడా కలుపుతారు. ఇది శరీరంలో క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి శీతల పానీయాల వాడకాన్ని తగ్గించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories