Health Tips: ఈ పండ్లు రోజుతింటే లైంగిక ఆరోగ్యం మెరుగపడుతుంది.. అవేంటంటే..?

Health Tips: శారీరకంగా,మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే లైంగిక జీవితం బాగుంటుంది.

Arun Chilukuri
Updated on: 5 Feb 2023 8:00 PM IST
Eating These Fruits Daily Improves Sexual Health Know That
X

Health Tips: ఈ పండ్లు రోజుతింటే లైంగిక ఆరోగ్యం మెరుగపడుతుంది.. అవేంటంటే..?

Health Tips: శారీరకంగా,మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే లైంగిక జీవితం బాగుంటుంది. అయితే కొన్ని ఆహారాలు కూడా ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి సహాయపడుతాయి. ఇవి లిబిడోను పెంచి రక్తప్రసరణ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో లైంగిక ఆరోగ్యంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది. వాస్తవానికి కొంతమంది కొన్ని రకాల సప్లిమెంట్లని తీసుకుంటారు. వీటి ఉపయోగం తక్కువగా ఉండి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ఉంటాయి. లైంగిక ఆరోగ్యాన్ని పెంచే కొన్ని పండ్ల గురించి ఈరోజు తెలుసుకుందాం.

దానిమ్మ

దానిమ్మ లైంగిక ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఒక దానిమ్మపండు తినడం వల్ల లిబిడో నాణ్యత పెరుగుతుంది. గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న మహిళలకు ఇది చాలా మంచిది. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పురుషులు, స్త్రీల లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ ఒక దానిమ్మపండును తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

ఖర్జూర పండ్లు

పురుషుల లైంగిక ఆరోగ్యానికి ఖర్జూరం ఉత్తమమైనది. మహిళలు ప్రతిరోజూ ఖర్జూరాన్ని తీసుకుంటే లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఖర్జూరాలు సహజమైన కామోద్దీపనగా పనిచేస్తాయి. కాబట్టి లైంగిక సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఐరన్, విటమిన్లు, అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మీకు అన్ని విధాలా మేలు చేస్తాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story