Vitamin-E Rich Foods: మెరిసే చర్మం కోసం విటమిన్ ఈ ఫుడ్స్‌ తినాలి.. అవేంటంటే..?

Eat Foods Rich In Vitamin-E For Healthy And Glowing Skin Know That
x

Vitamin-E Rich Foods: మెరిసే చర్మం కోసం విటమిన్ ఈ ఫుడ్స్‌ తినాలి.. అవేంటంటే..?

Highlights

Vitamin-E Rich Foods: ఈ రోజుల్లో చాలామందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి.

Vitamin-E Rich Foods: ఈ రోజుల్లో చాలామందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. దీనికి కారణం పొల్యూషన్‌, జీవన విధానం ఇంకా పోషకాహార లోపం. మెరిసే చర్మాన్ని కలిగి ఉండాలంటే విటమిన్ E ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. రోజువారీ ఆహారంలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని చేర్చడం వల్ల వయసును తగ్గించుకోవచ్చు. ఈ రోజు విటమిన్ ఈ పుష్కలంగా ఉండే ఆహారాల గురించి తెలుసుకుందాం.

బాదంపప్పు

బాదం విటమిన్ ఇ పవర్‌హౌస్. 100 గ్రాముల బాదంపప్పులో 25 మి.గ్రా విటమిన్ ఇ లభిస్తుంది. వీటిని మీ అల్పాహారంలో చేర్చండి.

పొద్దు తిరుగుడు గింజలు

పొద్దు తిరుగుడు గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల గింజల్లో 35 మి.గ్రా విటమిన్ ఇ ఉంటుంది. వీటిని స్నాక్స్‌గా తినండి.

బచ్చలికూర, బ్రోకలి

బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయల్లో విటమిన్ E అధికంగా ఉంటుంది. వీటిని సూప్ తయారు చేసి తాగండి లేదా కూర వండుకొని తినండి.

అవకాడో

అవకాడో రుచికరమైన పండు. దీంట్లో విటమిన్ ఇ పెద్ద మొత్తంలో లభిస్తుంది. 100 గ్రాముల అవకాడోలో 7 mg విటమిన్ E ఉంటుంది. దీన్ని టోస్ట్‌పై స్ప్రెడ్ చేయండి. సలాడ్‌లో కలుపుకుని తినడం అలవాటు చేసుకోండి.

టొమాటో

టొమాటోలో లైకోపీన్ పుష్కలంగా ఉండటమే కాకుండా విటమిన్ ఇకి మంచి మూలం కూడా. 100 గ్రాముల టొమాటోలో 1.5 మి.గ్రా విటమిన్ ఇ ఉంటుంది. దీన్ని సలాడ్‌లో కలుపుకుని తాగవచ్చు. లేదా కూరలలో యాడ్‌ చేసుకుని తినవచ్చు.

సాల్మన్‌, ట్యూనా చేపలు

సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో విటమిన్ ఇ, ఒమేగా -3 కొవ్వు లభిస్తుంది. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. వారానికి రెండుసార్లు చేపలు తినడం వల్ల చర్మానికి మంచి పోషణ లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories