Health: ఆ సమస్యతో బాధపడేవారు రాత్రిపూట ఇది తింటే చాలు..!

Health: ఆధునిక జీవనశైలి, తినే ఆహారంలో మార్పుల వల్ల చాలామంది లైంగిక సమస్యలని ఎదుర్కొంటున్నారు.

Arun Chilukuri
Updated on: 4 March 2022 8:01 PM IST
Drop Viagra Eat a Bowl of Pomegranate at Night
X

Health: ఆ సమస్యతో బాధపడేవారు రాత్రిపూట ఇది తింటే చాలు..!

Health: ఆధునిక జీవనశైలి, తినే ఆహారంలో మార్పుల వల్ల చాలామంది లైంగిక సమస్యలని ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి తప్పించుకోవడానికి రకరకాల ట్యాబ్లెట్లని ఆశ్రయిస్తున్నారు. అందులో ప్రధానమైనది వయాగ్ర. ఇది లైంగిక పట్టుత్వాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ దీని వల్ల ఆరోగ్యానికి చాలా దుష్ప్రభావాలు ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే. అందుకే సహజసిద్దమైన వస్తువులని వాడితే ఎటువంటి సమస్యలు ఉండవు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే దానిమ్మపండు. ఇందులో వయాగ్రలో ఉండే శక్తి ఉంటుంది. అంతేకాకుండా ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు.

మీరు మీ లైంగిక జీవితాన్ని ఆనందించాలంటే రాత్రి పడుకునే ముందు దానిమ్మపండు తింటే సరిపోతుంది. ఇది కాకుండా అల్లం కూడా వాడవచ్చు. వీటిని తినడం వల్ల చాలావరకు మీ సమస్యలు పరిష్కారమవుతాయి. శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచే శక్తి వీటికి ఉంటుంది. మీ శరీరంలో లైంగికతను పెంచడానికి టెస్టోస్టెరాన్ హార్మోన్ పనిచేస్తుంది. ఇది సాధారణ లైంగిక జీవితానికి అవసరమైన హార్మోన్. వీటిని ఈ రోజే మీ డైట్‌లో చేర్చకోండి. సైడ్‌ ఎఫెక్స్‌ కలిగించే మందులపై ఆధారపడటం మానేయండి.

అలాగే దానిమ్మ రసంలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మన కణాలను దెబ్బతీసే శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధులకు రాకుండా చూస్తాయి. రోజూ దానిమ్మ రసం తాగడం ద్వారా క్యాన్సర్‌ను జయించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తం పలుచబడటానికి దోహదం చేస్తాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story