Weight Loss: నీళ్లు ఇలా తాగితే వెయిట్ లాస్ అవ్చొచ్చు!

Weight Loss
x

Weight Loss: నీళ్లు ఇలా తాగితే వెయిట్ లాస్ అవ్చొచ్చు!

Highlights

Weight Loss: వెయిట్ లాస్ కోసం చాలామంది చాలారకాలుగా ట్రై చేస్తుంటారు. అయితే బరువు తగ్గే విషయంలో నీళ్లు అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తాయని డైటీషియన్లు సూచిస్తున్నారు.

Weight Loss: వెయిట్ లాస్ కోసం చాలామంది చాలారకాలుగా ట్రై చేస్తుంటారు. అయితే బరువు తగ్గే విషయంలో నీళ్లు అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తాయని డైటీషియన్లు సూచిస్తున్నారు. వెయిట్ లాస్ ప్రయత్నంలో ఉన్నవాళ్లు నీళ్లు ఎలా తాగాలంటే..

బరువు తగ్గాలనుకునేవాళ్లు డైట్ మార్పులు, వ్యాయామంతోపాటు నీళ్లు తాగే విషయంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అదెలాగంటే..

బరువు తగ్గాలనుకునేవాళ్లు రోజుకి మూడు లేదా నాలుగు లీటర్ల నీటిని తాగాలి. తగినంత నీళ్లు తాగినప్పుడే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. గ్యాస్, పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలుండవు. నీరసం, బద్ధకం తగ్గుతాయి.

వెయిట్ లాస్ ప్రయత్నాల్లో ఉన్నవాళ్లు ఉదయం లేవగానే గోరవెచ్చని నీళ్లు తాగాలి. నీటిలో కొద్దిగా నిమ్మరసం, తెనె కలుపుకుంటే ఫ్యాట్ కరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే తాగిన ప్రతిసారీ కనీసం అరలీటరు నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే ఆకలి తగ్గుతుంది. ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు.

రోజుకి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలని రూల్ పెట్టుకుంటే అందులో ఒక లీటర్ ను పొద్దు్న్నే తాగేయడం మంచిది. అలాగే మరో లీటర్ నీటిని నేరుగా కాకుండా జ్యూస్ లేదా మజ్జిగ, నిమ్మరసం, జీరా వాటర్.. ఇలా మరేదైనా రూపంలో తీసుకుంటే మంచిది.

బరువు తగ్గాలనుకునేవాళ్లు గంట లేదా రెండు గంటలకోసారి నీళ్లు తాగుతూ ఉండడం వల్ల ఆకలి ఫీలింగ్ తగ్గుతుంది. అలాగే నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం వంటివి కలుపుకుంటే శక్తి నశించకుండా యాక్టివ్‌గా ఉండొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories