Water:నీరు మోతాదు మించి తాగితే ముప్పే.. ఈ విషయం మీకు తెలుసా..?

Drinking too much water can be dangerous Do you know this
x

నీరు మోతాదు మించి తాగితే ముప్పే.. ఈ విషయం మీకు తెలుసా..?

Highlights

మానవునికి ప్రాణాధారమైంది నీరు. నిత్య జీవితంలో నీటి ఉపయోగం అత్యంత ప్రధానమైంది. అందుకే ఆరోగ్యం బాగుండాలంటే తగినంత నీరు అవసరం.

Water: మానవునికి ప్రాణాధారమైంది నీరు. నిత్య జీవితంలో నీటి ఉపయోగం అత్యంత ప్రధానమైంది. అందుకే ఆరోగ్యం బాగుండాలంటే తగినంత నీరు అవసరం. శరీరం లోపల నీటితో అనేకమైన ప్రజయోజనాలున్నాయి. నీరు ఆహార రసం శరీరంలో కలవడానికి ఉపయోగపడుతుంది. రక్తాన్ని ద్రవరూపంలో ఉంచుతుంది. శరీరపు ఉష్ణోగ్రతను కాపాడుతుంది. మూత్రం ద్వారా చెడు పదార్థాలను వెలుపలకు పంపుతుంది. ఆహారం నమిలేటప్పుడు రసాలను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలోని చెడు పదార్థాలను మూత్రం ద్వారా, చెమట ద్వారా బయటకు పంపుతుంది. అయితే తక్కువ నీరు తాగితే అనారోగ్యానికి దారితీసినట్లే.. ఎక్కువ నీరు కూడా ముప్పే అంటున్నారు వైద్య నిపుణులు. అందుకే నీరు తాగడం మోతాదుల్లోనే ఉండాలని సూచిస్తున్నారు.

అమెరికాకు చెందిన నేషనల్ అకాడమిక్స్ సంస్థ ప్రకారం పురుషులకు రోజుకు సగటున 3.7 లీటర్లు, మహిళలకు 2.7 లీటర్ల నీరు అవసరం. ఆహారం, ఇతర పానియాల నుంచి అందే నీటిశాతం ఇందులో భాగమే. అయితే ఈ లెక్కలు అన్ని వేళలా అందరికీ ఒకేలా వర్తించాలనేది లేదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

శారీరక శ్రమ: ఎంత ఎక్కువ శారీరక శ్రమ చేస్తే.. శరీరం నుంచి అదే రీతిలో చెమట రూపంలో నీళ్లు వెళ్లిపోతాయి. దీంతో దానికి తగినట్టుగా నీరు తీసుకోవాల్సి ఉంటుంది.

వాతావరణం: అధిక ఉష్ణోగ్రతల పరిస్థితుల్లో ఎక్కువ చెమట పడుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

ఆహార శైలి: ఉప్పు, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే.. శరీరానికి మరింత నీటి అవసరం ఏర్పడుతుంది.

ఆరోగ్యం-ఔషధాలు: జ్వరం, డయేరియా, మధుమేహం వంటి పరిస్థితితుల్లో నీటి అవసరాలు పెరుగుతాయి. కొన్ని రకాల మందులు కూడా హైడ్రేషన్ స్థాయులను ప్రభావితం చేస్తాయి.

శరీరం-వయసు: పిల్లలు, పెద్దలు, గర్భిణులు, బాలింతలు, భారీ కాయం కలిగినవారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా నీటి అవసరాలు ఉంటాయి.

ఆల్కహాల్-కెఫిన్: వీటి కారణంగా డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో నీళ్లు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.

అయితే కొందరు మోతాదునికి మించి నీళ్లు తాగుతుంటారు. అయితే మోతాదుకి మించి నీళ్లు తాడగం కూడా ముప్పే అంటున్నారు వైద్య నిపుణులు. నీళ్లు మోతాదుకి మించి తాగితే కిడ్నీలపై అధిక ఒత్తిడి పడుతుంది. మూత్రపిండాల వ్యాధులు వంటివి ఉన్న వారిలో సరైన మోతాదులో నీళ్లు, విషతుల్యాలు బయటకి వెళ్లకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, రక్త పోటులో హెచ్చుతగ్గులు వంటి అనారోగ్యాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. రక్తంలో సోడియం లెవల్స్ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్య తీవ్రమైన పరిస్థితుల్లో వికారం, వాంతులు, మూర్చ వంటివాటితో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

శరీరంలో నీటి స్థాయిలు పెరిగాయన్న విషయం కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. తలనొప్పి, కడుపు నొప్పి, కండరాల బలహీనత, వికారం, వాంతులు, నీరసం, అలసట, పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటివి కనిపిస్తాయంటున్నారు. వీటిలో కొన్ని లక్షణాలు శరీరంలో నీటి స్థాయులు తగ్గినప్పుడు కూడా బయటపడతాయని అంటున్నారు. అందుకే డాక్టర్‌ని సంప్రదించి వారి సలహాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. రోజూ నిర్ణీత మొత్తంలోనే నీళ్లు తాగాలనే నియమం పెట్టుకునే బదులు.. ఈ విషయంలో శరీరం ఇచ్చే కొన్ని సూచనలు లెక్కలోకి తీసుకోవాలి. దాహం, మూత్రం రంగు, జీర్ణక్రియ వంటివి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీరు తాగేయకుండా తరచూ కొద్ది కొద్దిగా తాగడమే ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు.

Show Full Article
Print Article
Next Story
More Stories