Beetroot Juice: పరగడుపున బీట్‌రూట్‌ తాగితే అద్భుత ప్రయోజనాలు.. అవేంటంటే..?

Drinking beetroot juice on empty stomach has amazing benefits
x

Beetroot Juice: పరగడుపున బీట్‌రూట్‌ తాగితే అద్భుత ప్రయోజనాలు.. అవేంటంటే..?

Highlights

Beetroot Juice: పరగడుపున బీట్‌రూట్‌ తాగితే అద్భుత ప్రయోజనాలు.. అవేంటంటే..?

Beetroot Juice: మీ స్టమక్‌ని శుభ్రం చేయడానికి డిటాక్స్ వాటర్ చక్కగా పనిచేస్తుంది. ఇది మీ శరీరం నుంచి విష పదార్థాలను బయటికి పంపించివేస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది మీ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల తరచుగా మీరు చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సందర్భంలో మీరు డిటాక్స్ నీటిని తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి మీరు దీన్ని మీ దినచర్యలో చేర్చవచ్చు. ఈ పానీయం పోషకాలతో నిండి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది. బీట్‌రూట్ నుంచి డిటాక్స్ నీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

1.నీరు 3 కప్పులు

2. పుదీనా ఆకులు

3. ఆపిల్ వెనిగర్ 2 స్పూన్

4. 1/2 నిమ్మ, 1/2 కాల్చిన దుంప

నీరు, పుదీనా ఆకులు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ ముక్కలు, బీట్‌రూట్‌ జ్యూస్‌కి కి కలపాలి. 5-10 నిమిషాల తరువాత ఫిల్టర్ చేసి తాగాలి. మీరు దీన్ని ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా చేయవచ్చే.

డిటాక్స్ నీటి ప్రయోజనాలు

ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో తాగడం వల్ల బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని నివేదికల ప్రకారం.. దీనికి ఆపిల్ సైడర్ వెనిగర్ జోడించడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. ఇది బెల్లీ ఫ్యాట్‌ని కూడా తగ్గిస్తుంది. పుదీనా ఈ డిటాక్స్ నీటికి తాజాదనాన్ని ఇస్తుంది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీవక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది కేలరీలు బర్నింగ్ చేయడానికి సహాయపడుతుంది.

బీట్‌రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. బీట్రూట్లో విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను తొలగించడానికి పనిచేస్తుంది. బీట్‌రూట్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది శరీరంలో అలసట, బలహీనత వంటి సమస్యలను తొలగిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరం. ఇందులో ఐరన్ ఉంటుంది. డయాబెటిస్ సమస్యను తగ్గించడానికి దీనిని తీసుకోవచ్చు. అధ్యయనాల ప్రకారం.. బీట్‌రూట్‌లో బెటలైన్‌లు ఉంటాయి. ఈ కారణంగా దాని రంగు కూడా ఎరుపు రంగులో ఉంటుంది ఇది క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories