చర్మం నిగనిగలాడాలంటే ఈ పండ్ల రసాలు తాగాలి

చర్మం నిగనిగలాడాలంటే ఈ పండ్ల రసాలు తాగాలి
x
Highlights

పండ్లు తినడం వల్ల, పండ్ల రసాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే కూరగాయలు , ఆకుకూరలతో పాటు పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

పండ్లు తినడం వల్ల, పండ్ల రసాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే కూరగాయలు , ఆకుకూరలతో పాటు పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. మనకి లభించే ఒక్కో పండు ఎన్నో పోషకాల ఉంటాయి. అందుకే జ్వరం వచ్చినా..కాస్త సుస్తి చేసినా...నీరసంగా ఉన్నా..వేడి చేసినా...పిల్లలకైనా పెద్దలకైనా ఎలాంటి లిమిట్స్ లేకుండా పండ్ల రసాలను తాగమని సూచిస్తుంటారు డాక్టర్లు.

ప్రతి రోజు ఏదో ఒక పండ్ల రసం తాగటం వల్ల మానవ శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. మరి సమ్మర్ వచ్చేస్తోంది అంటే అందరూ చర్మ సంరక్షణపై ఆసక్తిని కనబరుస్తుంటారు. సూర్యుని కిరణాల వేడిని నుంచి తప్పించుకునేందుకు ఎన్నో పాట్లు పడతారు. సన్‌స్క్రీన్ లోషన్‌లని, పేస్‌ ప్యాక్‌లనీ, క్రీములనీ, పేషియల్స్ అని ఇలా నిత్యం చర్మ సంరక్షణకు జాగ్రత్తలను తీసుకుంటుంటారు..

ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి పైగా సమస్యను అప్పటి వరకు తీరుస్తాయేమో కానీ అనంతరం వాటి ప్రభావం కనబడుతుంది..అందుకే ఇలా ఇన్‌స్టంట్ అందం కోసం పాకులాడకుండా...నిత్యం పండ్ల రసాలను ...అందులోనూ వారానికి మూడు సార్లు ఫ్రూట్ జ్యూస్‌లను తాగితే చాలు ఆరోగ్యం మీ చెంతే అంటున్నారు నిపుణులు

చర్మానికి మేలు చేసే ఎన్నో పండ్ల రసాలు ఉన్నాయి. అందులో మొదటిది బీట్‌రూట్ ...365 రోజులు లభించే ఈ బీట్‌రూట్ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ జ్యూస్ శరీరంలోని రక్తాన్ని శుద్ధి పరుస్తుంది. తద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది..ఇక సమ్మర్‌లో విరివిగా లభించే పుచ్చపండ్ల జ్యూస్‌ కూడా చర్మ సౌందర్యానికి తోడ్పడుతుంది. పుచ్చకాయ రసం తాగడం వల్ల చర్మం తాజాగా , మెరిసేలా చేస్తుంది.

టమోటా పండు రసం తాగడం వల్ల రక్తశుద్ధి జరిగి శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఈ జ్యూస్‌ను చక్కెర వేసుకుని తాగాలి. జ్యూస్ గా తీసుకోలేని వారు టమోటా ప్యూరీని పేస్ ప్యాక్‌ లాగా చేసుకుని చర్మాన్ని గంట సేపు రాసుకుని ఆ తరువాత కడిగేస్తే నిగనిగలాడుతుంది.

క్యారట్ చర్మ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఎండ కారణంగా చర్మ ఎర్రబడినా దెబ్బతిన్నా క్యారట్ జ్యూస్ తాగితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇక పేదవాడి ఆపిల్ అయిన జామ రసం చర్మానికి నిగారింపు తేవడంలో చురుగ్గా పనిచేస్తుంది. పండే కాదు జామ ఆకులు జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories