Health Tips: కిచెన్‌లోని ఈ మసాలాలు ఇమ్యూనిటీ పెంచుతాయి.. అవేంటంటే..?

Dont Stress About Corona These Spices in the Kitchen Increase Immunity
x

Health Tips: కిచెన్‌లోని ఈ మసాలాలు ఇమ్యూనిటీ పెంచుతాయి.. అవేంటంటే..?

Highlights

Health Tips: చలితో పాటు ఇప్పుడు కరోనా కూడా మొదలైంది.

Health Tips: చలితో పాటు ఇప్పుడు కరోనా కూడా మొదలైంది. చైనా నుంచి వస్తున్న కోవిడ్ 19 వార్త ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. చలికాలంలో జలుబు, జ్వరం వంటి వ్యాధులు రావడం సర్వసాధారణం. జలుబుతో పాటు, ఫ్లూ, వైరస్ ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడే ఔషధాలు ఇంట్లోనే ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పసుపు

పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు మన శరీరంలోని అనేక వ్యాధులకు నివారణగా పనిచేస్తుంది. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా తయారవుతుంది. గోరు వెచ్చని పాలలో కొంచెం పసుపు కలిపి తీసుకోవచ్చు.

పచ్చి ఏలకులు

పచ్చి ఏలకులు అద్భుతంగా పనిచేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగిన మూలకాలు ఇందులో ఉంటాయి. వీటిని ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు.

లవంగం

లవంగం ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలని అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన మూలకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. దీని ప్రభావం చాలా వేడిగా ఉంటుంది.

జాజికాయ

జాజికాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రాగి, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన మూలకాలను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థని బలంగా చేస్తాయి. చాలా మంది పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం జాజికాయను ఆహారంలో చేర్చాలి.

నల్ల మిరియాలు

మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగిన మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. నల్ల మిరియాలు ప్రతి ఇంట్లో మసాలాగా ఉపయోగిస్తారు. టీలో కలుపుకుని తాగడానికి చాలా మంది ఇష్టపడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories