Lipstick Harm Lips: లిప్ స్టిక్ పెదాలకు హాని చేస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోపోతే నష్టమే..!

Does Lipstick Harm Lips Keep These Things in Mind
x

Lipstick Harm Lips: లిప్ స్టిక్ పెదాలకు హాని చేస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోపోతే నష్టమే..!

Highlights

Lipstick Harm Lips: మేకప్‌ కిట్‌లో లిప్‌స్టిక్‌ అత్యంత ముఖ్యమైనది. కాస్మెటిక్ ఉత్పత్తులలో దీనిని చాలా కాలంగా వాడుతున్నారు.

Lipstick Harm Lips: మేకప్‌ కిట్‌లో లిప్‌స్టిక్‌ అత్యంత ముఖ్యమైనది. కాస్మెటిక్ ఉత్పత్తులలో దీనిని చాలా కాలంగా వాడుతున్నారు. పెదాలు అందంగా కనిపించడానికి లిప్‌స్టిక్‌ని ఉపయోగిస్తారు. అయితే దీని తయారీ పలుసార్లు వివాదస్పదంగా మారుతోంది. ఇది కాకుండా లిప్‌స్టిక్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల పెదాలకు హాని జరుగుతుందని ఇటీవల అనేక పరిశోధనలలో తేలింది. అందాన్ని పెంచే లిప్ స్టిక్ వల్ల కూడా నష్టాలు ఉంటాయని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

పగిలిన పెదవులు

లిప్‌స్టిక్‌లో పెదవులకు హాని కలిగించే అనేక అంశాలు ఉన్నాయి. రోజూ లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల పెదాలు పొడిబారతాయి. దీని కారణంగా పెదవులు పగిలిపోతాయి. అయితే నాణ్యమైన లిప్‌స్టిక్‌లలో నూనెలు, వెన్న వంటి అనేక మాయిశ్చరైజింగ్ పదార్థాలు ఉంటాయి. ఇవి పెదవుల హైడ్రేషన్‌ను మెయింటెన్‌ చేయడంలో పనిచేస్తాయి.

అలెర్జీ

చాలా మంది లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల అలర్జీ వస్తుందని చెబుతున్నారు. అయితే వాస్తవానికి లిప్‌స్టిక్‌కి అలెర్జీకి గురిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇది దాని నాణ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది. పెద్ద కాస్మెటిక్ కంపెనీలు భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాయి. కాబట్టి నాణ్యమైన లిప్‌స్టిక్‌తో అలర్జీ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

ఇవి గుర్తుంచుకోండి

హైడ్రేషన్: పెదవులు పొడిబారకుండా ఉండటానికి మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. పెదవులు హైడ్రేట్‌గా ఉన్నప్పుడు అవి పొడిగా, పగిలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఎక్స్‌ఫోలియేషన్: తరచుగా స్క్రబ్బర్ లేదా మృదువైన బ్రష్‌తో పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. దీని వల్ల పెదవుల డెడ్ స్కిన్ సెల్స్ బయటకు వస్తాయి. దీంతో అవి మృదువుగా మారుతాయి.

లిప్ బామ్ అప్లై : లిప్ స్టిక్ వేసుకునే ముందు పెదవులపై లిప్ బామ్ లేదా కండీషనర్ రాయాలి. దీంతో పెదాలు పొడిబారడం తగ్గుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories