Eating Bread: రొట్టె తింటే నిజంగానే బరువు తగ్గుతారా.. నిపుణుల మాట ఏంటి..?

Does eating bread really help you lose weight find out what the experts say
x

Eating Bread: రొట్టె తింటే నిజంగానే బరువు తగ్గుతారా.. నిపుణుల మాట ఏంటి..?

Highlights

Eating Bread:మనదేశంలో రోజుకు మూడు పూటలా అన్నం తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

Eating Bread: మనదేశంలో రోజుకు మూడు పూటలా అన్నం తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం దేశంలో వరిపంట ఎక్కువగా పండిస్తారు. దీనివల్ల బియ్యం సమృద్ధి గా లభిస్తాయి. మరొకటి దేశంలో శ్రామికవర్గం ఎక్కువగా ఉన్నారు. వీరు కాయకష్టం చేసుకొని బతికేవారు. వీరికి అన్నం తింటే మాత్రమే కావాల్సిన శక్తి వస్తుంది. అయితే కూర్చొని ఉద్యోగాలు చేసేవారు, శారీరక శ్రమ చేయనివారు కూడా అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇలాంటి వారు అన్నం కంటే రొట్టె తినడం ఉత్తమం. దీనికి గల కారణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బియ్యం, రొట్టె ఈ రెండింటి పోషక విలువల్లో చాలా తేడా ఉంటుంది. బరువు తగ్గాలనేవారు రెండూ తినాలని నిపుణులు చెబుతున్నారు. వారానికి 4 రోజులు రొట్టె తింటే 2 రోజులు అన్నం తినాలంటున్నారు. ఇలా చేస్తే బరువు కంట్రోల్‌లో ఉంటుందని చెబుతున్నారు. కానీ బరువు తగ్గడం కోసం ఎప్పుడూ ఆకలితో ఉండకూడదట. ఇది ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తుంది. రొట్టెలో గ్లూటెన్ ఉంటే బియ్యంలో ఉండదు. కొందరికి గ్లూటెన్ ఇష్టముండదు. అలాంటి వారు తక్కువ మొత్తంలో రొట్టె ఎక్కువ అన్నం తీసుకోవడం బెటర్. అయితే షుగర్‌ వ్యాధిగ్రస్తులకు అన్నం కంటే రొట్టె తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు సలహా ఇస్తున్నారు.

జొన్నలు, రాగులు, ఇతర చిరుధాన్యాలతో చేసిన రొట్టెలు బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయి పెరగదు. అంతేకాకుండా ఇవి చాలా పోషకమైనవి. బరువు తగ్గించడంలో చాలా సాయపడుతా యి. ఒకవేళ రైస్ తింటూ బరువు తగ్గాలనుకుంటే బ్రౌన్ రైస్ మంచి ఆప్షన అని నిపుణులు చెబు తున్నారు. ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే నీరు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories