Health Tips: ఎక్కువగా నీరు తాగినా ప్రమాదమే.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..!

Does drinking too much water cause death research reveals surprising things
x

Health Tips: ఎక్కువగా నీరు తాగినా ప్రమాదమే.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..!

Highlights

Health Tips: శరీరంలో దాదాపు 70 శాతం నీళ్లతో నిర్మితమై ఉంటుంది.. సరైన మొత్తంలో నీరు తాగడం చాలా ముఖ్యం

Health Tips: నీరు లేకుంటే మానవాళి బతుకే లేదు. శరీరంలో దాదాపు 70 శాతం నీళ్లతో నిర్మితమై ఉంటుంది. సరైన మొత్తంలో నీరు తాగడం చాలా ముఖ్యం. కానీ కొంతమంది ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోక ఎక్కువగా తాగడం వల్ల మేలు జరుగుతుందని భావిస్తారు. అధిక మొత్తంలో నీరు తాగడం మరణానికి దారితీస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక అధ్యయనంలో ఎక్కువగా నీరు తాగడం వల్ల హైపోనట్రేమియా వస్తుందని తేలింది. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

హైపోనట్రేమియా అంటే ఏమిటి?

సోడియం శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది గుండె, కణాలు, మూత్రపిండాల పనితీరులో సహాయపడుతుంది. ఎవరైనా అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగినప్పుడు అతని శరీరంలో సోడియం పరిమాణం తగ్గుతుంది. శరీరం సరిగ్గా పనిచేయదు. దీని వల్ల ప్రజలు మరణిస్తారు. ఫైటర్‌ బ్రూస్ లీ గురించి అందరికి తెలిసిందే. ప్రతి దేశంలో అతడికి అభిమానులు ఉంటారు. అతడు కేవలం 32 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

20 జూలై 1973న మరణించాడు. బ్రూస్ లీ మరణించిన 49 సంవత్సరాల తరువాత శాస్త్రవేత్తలు ఎక్కువ నీరు త్రాగడమే అతని మరణానికి కారణమని తేల్చారు. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హైపోనట్రేమియా అంటారు. అంతకుముందు బ్రూస్ లీ మరణానికి మెదడులో వాపు కారణమని చెప్పారు. శాస్త్రవేత్తల ప్రకారం బ్రూస్ లీ మరణానికి కారణం హైపోనాట్రేమియా. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు హైపోనట్రేమియా వస్తుంది.

శరీరంలో సోడియం స్థాయి తక్కువగా ఉన్నప్పుడు కణాలలో (ముఖ్యంగా మెదడు కణాలు) వాపును కలిగిస్తుంది. బ్రూస్ లీ చాలా ద్రవాలను తీసుకునేవాడు. దీనివల్ల అతనికి దాహం ఎక్కువైంది. దీని కారణంగా అతనికి హైపోనాట్రేమియా వచ్చింది. ఇందులో మూత్రపిండాల నుంచి నీరు విడుదల కాదు. దీని కారణంగా ప్రజలు చనిపోతారు. బ్రూస్ లీ మరణానికి కారణం ఇదే అని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories