Spicy Food Side Effects: స్పైసీ ఫుడ్ తినకుండా ఉండలేరా.. ఈ సమస్యలు ఎదుర్కొనేందుకు రెడీ అవ్వండి..!

Do You Like To Eat Spicy Food Be Prepared For These Health Problems
x

Spicy Food Side Effects: స్పైసీ ఫుడ్ తినకుండా ఉండలేరా.. ఈ సమస్యలు ఎదుర్కొనేందుకు రెడీ అవ్వండి..!

Highlights

Spicy Food Side Effects: సాధారణ ఆహారం కన్నా స్పైసీ ఫుడ్ ఎక్కువ రుచిగా ఉంటుంది. అందుకే చాలామంది ఇటువైపే ఎక్కువ మొగ్గు చూపుతారు.

Spicy Food Side Effects: సాధారణ ఆహారం కన్నా స్పైసీ ఫుడ్ ఎక్కువ రుచిగా ఉంటుంది. అందుకే చాలామంది ఇటువైపే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ప్రతి రోజు స్పైసీ ఫుడ్‌ తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ వంటగదిలో కకొంతమంది మిరప పొడిని ఎక్కువగా ఉపయోగిస్తారు. స్పైసీ ఫుడ్స్‌ని పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. లేదంటే కలిగే అనర్థాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

అజీర్ణం

స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతాయి. అజీర్ణం, గ్యాస్, కడుపు సమస్యలు ఎదురవుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేయడానికి స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం పరిమితం చేయడం అవసరం.

మానసిక సమస్యలు

స్పైసీ ఫుడ్ తినడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇది మరింత ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తుంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడొద్దంటే స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

అధిక రక్తపోటు

స్పైసీ ఫుడ్‌లో ఎక్కువ ఉప్పు, మసాలాలు ఉంటాయి. ఇప్పటికే అధిక BP ఉన్న రోగి అయితే మసాలాలు తీసుకోవడం తగ్గించండి. లేదంటే దీర్ఘకాలంలో గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.

డ్రై స్కిన్

స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంలో తేమ తగ్గి పొడిబారడం మొదలవుతుంది. చర్మ సమస్యలు ఎదురవుతాయి. మిరపకాయలు, మసాలాలు పరిమిత పరిమాణంలో వాడటం మంచిది.

బరువు పెరగడం

ఘాటైన, మసాలా ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల బరువు పెరుగుతారు. దీనికి కారణం ఇందులో ఎక్కువ క్యాలరీలు ఉండటమే. అంతేకాదు తిన్న తర్వాత మరింత ఆకలిగా అనిపిస్తుంది.

పైల్స్

ఎక్కువ కారం, మసాలాలు తినే వారికి పైల్స్ సమస్య వస్తుంది. ఈ రోజే స్పైసీ ఫుడ్‌ తినడం మానేసి మంచి జీవనశైలిని పాటించడం మొదలుపెట్టండి.

Show Full Article
Print Article
Next Story
More Stories