Honeymoon: పెళ్లయిందా? హనీమూన్‌కి వెళ్తున్నారా? అసలు దీన్ని హనీమూన్‌ అని ఎందుకు అంటారో తెలుసా?

Honeymoon: పెళ్లయిందా? హనీమూన్‌కి వెళ్తున్నారా? అసలు దీన్ని హనీమూన్‌ అని ఎందుకు అంటారో తెలుసా?
x
Highlights

Honeymoon: పెళ్లి అందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం. పిల్లల పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బును పొదుపు చేస్తుంటారు. ప్రస్తుతం ముందు...

Honeymoon: పెళ్లి అందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం. పిల్లల పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బును పొదుపు చేస్తుంటారు. ప్రస్తుతం ముందు చూపని హనీమూన్ విషయంలో కూడా చూపుతున్నారు. కొత్త జంటలు తమకు నచ్చిన డెస్టినేషన్ లో కొన్నిరోజులు సరదాగా గడిపి రావాలని కోరుకుంటున్నారు. ఇందంతా మాకు తెలుసులే అని చాలామంది అనుకుంటున్నారు కావచ్చు. కానీ పెళ్లి జరిగిన తర్వాత వెళ్లే మొదటి ట్రిప్ కు హనీమూన్ అనే పేరు ఎందుకు వచ్చిందో చాలా మందికి తెలియదు. హనీమూన్ పేరుకు తగ్గట్లుగా తేనెకి, చంద్రుడికి ఏమైనా లింక్ ఉందా అనే ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే మనం ఓసారి చరిత్రలోకి, సంప్రదాయాల్లోకి వెళ్లాలి.

హనీమూన్ అనే పదం రెండు పదాల కలయిక, హనీ అంటే తేనె, మూన్ అంటే చంద్రడు. ఇక్కడ హనీ అనేది కొత్తగా పెళ్లైన వారి జీవితంలోని స్వీట్ నెస్ ను సంతోషాన్ని సూచిస్తుంది. మధ్యయుగపు యూరప్ లో కొత్తగా పెళ్లైన వారికి తేనె నీరు కలిపి పులియబెట్టిన డ్రింక్ ఇచ్చేవారట. దీంతో తేనెకు పెళ్లికి ఉన్న సంబంధం మరింత బలపడింది.

అయితే మూన్ అంటే చంద్రుడు. చంద్రుడు నెలవంక నుంచి పౌర్ణమికి, మళ్లీ అమావాస్యకు రావడానికి నెల రోజుల సమయం పడుతుంది. అందుకే హనీమూన్ అనే పదం మొదట్లో పెళ్లైన తర్వాత వచ్చ నెల రోజులను చెప్పడానికి వాడుతుండేవారు. ఈ నెల రోజులు కొత్త దంపతులు జీవితంలో చాలా ఆనందంగా, ప్రేమగా ఉంటారని పూర్వం నమ్ముతుండేవారు. హనీమూన్ అనే పదం శతాబ్దాలుగా వాడుకలో ఉ:ది.

Show Full Article
Print Article
Next Story
More Stories