Health Tips: ఈ కూరగాయలని కోసిన తర్వాత కడగకూడదు.. ఎందుకంటే..?

Do Not Wash These Vegetables After Cutting Them
x

Health Tips: ఈ కూరగాయలని కోసిన తర్వాత కడగకూడదు.. ఎందుకంటే..?

Highlights

Health Tips: చలికాలం రాగానే మనుషుల్లో రకరకాల వ్యాధులు బయటపడుతాయి.

Health Tips: చలికాలం రాగానే మనుషుల్లో రకరకాల వ్యాధులు బయటపడుతాయి. కడుపు నొప్పి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. శీతాకాలంలో దొరికే ఆకుకూరలు ఈ సమస్యలకి దివ్యవౌషధంగా పనిచేస్తాయి. ఇవి శరీరానికి పోషణ అందించి ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. అయితే వీటిని వండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొందరు వీటిని కట్‌ చేసిన తర్వాత కడుగుతారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది.

కోసిన తర్వాత కడగవద్దు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆకు కూరలను కోసిన తర్వాత కడగకూడదు. ముందుగానే కడిగేసి తర్వాత కట్ చేసుకోవాలి. లేదంటే ఇందులోని పోషకాలు, లవణాలు అన్ని నీటిలోనే కలిసిపోతాయి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, క్యారెట్, ముల్లంగి వంటి వాటిని కడిగిన తర్వాత కట్‌చేసుకోవాలి. దీనివల్ల పోషకాలకి ఎటువంటి నష్టం జరగదు. శరీరానికి విటమిన్లు ఖనిజాల పూర్తి పోషణ లభిస్తుంది.

శీతాకాలంలో వ్యాధులను దూరంగా ఉంచడానికి ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఇది కాకుండా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. సరిపోయే నిద్ర పోవాలి. ఈ రోజుల్లో బద్దకం పోవాలంటే మధ్యమధ్యలో డికాషన్ తీసుకుంటూ ఉండాలి. చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బయటి ఆహారం జోలికి పోకూడదు. కాలుష్యం, పొగ ఉండే ప్రాంతాలకి దూరంగా ఉండటం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories