Health Tips: పరగడుపున ఈ పొరపాటు చేయవద్దు.. రకరకాల వ్యాధులని ఆహ్వానించినట్లే..!

Do Not Eat Ghee On An Empty Stomach It Will Harm The Intestines
x

Health Tips: పరగడుపున ఈ పొరపాటు చేయవద్దు.. రకరకాల వ్యాధులని ఆహ్వానించినట్లే..!

Highlights

Health Tips: పరగడుపున కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.

Health Tips: పరగడుపున కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అలాగే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల హాని జరుగుతుంది. ఈ కోవలోకి నెయ్యి వస్తుంది. వాస్తవానికి నెయ్యిలో చాలా ఔషధగుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో నెయ్యిని అమృతంగా చెబుతారు. శక్తిని పెంచడానికి, వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి నెయ్యి ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. కానీ పరగడుపున తినడం వల్ల లాభానికి బదులు నష్టం జరుగుతుంది. నెయ్యి సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం.

వాస్తవానికి పరగడుపున నెయ్యి ఎప్పుడు తినకూడదు. ఎందుకంటే ఇది ఒక భారీ ఆహారం. జీర్ణం కావడానికి శరీరం చాలా కష్టపడాలి. నెయ్యిలో ఉండే లాక్టోన్ పేగుకు హాని కలిగిస్తుంది. ఇది సరిగ్గా జీర్ణం కాకపోతే కడుపుని కలవరపెడుతుంది. మలం నుంచి చెడు వాసన వస్తుంది ఈ పరిస్థితిని స్టీటోరియా అని పిలుస్తారు. కొన్ని అధ్యయనాల ప్రకారం నెయ్యి జీర్ణం కాకపోతే డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఈ పరిస్థితి చాలాకాలం కొనసాగితే భవిష్యత్తులో గుండెపోటుకి దారితీస్తుంది.

నెయ్యి ఎప్పుడు తీసుకోవాలి..?

ఆయుర్వేదం ప్రకారం భోజనం తర్వాత నెయ్యి తినడం ఉత్తమం. భోజనం చేసిన తర్వాత నెయ్యి తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా శరీరానికి శక్తి లభిస్తుంది. నెయ్యి తినాలనుకుంటే ఉదయం ఖాళీ కడుపుతో తినవద్దు. భోజనం చేసిన తర్వాత మాత్రమే నెయ్యి తినడం అలవాటు చేసుకోవాలి.

నెయ్యి తినడం వల్ల ప్రయోజనాలు

నెయ్యిలో సంతృప్త కొవ్వు, మోనో అసంతృప్త కొవ్వు, బహుళఅసంతృప్త కొవ్వు ఉంటాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. శరీరానికి సరిపడ శక్తి లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories