Cucumber: దోసకాయ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా.. పొరపాటు చేస్తున్నారు..!

Do Not Drink Water After Eating Cucumber it is Harmful to Health | Health News
x

Cucumber: దోసకాయ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా.. పొరపాటు చేస్తున్నారు..!

Highlights

Cucumber: దోసకాయ తిన్న తర్వాత ఎంతమంది నీళ్లు తాగుతారు..? మీరు కూడా అలాంటి పొరపాటు చేస్తే చాలా నష్టం జరుగుతుంది...

Cucumber: దోసకాయ తిన్న తర్వాత ఎంతమంది నీళ్లు తాగుతారు..? మీరు కూడా అలాంటి పొరపాటు చేస్తే చాలా నష్టం జరుగుతుంది. దోసకాయలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, విటమిన్లు C, K కలిగి ఉంటాయి. అయితే సిలికా వంటి అవసరమైన పోషకాలు దాని తొక్కలో ఉంటాయి. దోసకాయ జుట్టు, చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్దకం సమస్యని నివారిస్తుంది.

దోసకాయ తిన్న తర్వాత మనం నీరు తాగకుంటే మాత్రమే ఈ పండులోని పోషకాలు శరీరానికిఅందుతాయి. లేదంటే జీర్ణక్రియ ప్రక్రియలో చాలా సమస్యలు వస్తాయి. వేసవిలో దోసకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తొలగిస్తాయి. దోసకాయ కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.

కీరదోసకాయ ఎముకలను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దోసకాయ తిన్న తర్వాత నీరు తాగవద్దని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. దోసకాయ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల ఆహార పదార్థాలను జీర్ణం చేసే కడుపులోని యాసిడ్ సరిగా పనిచేయదు. మీరు దోసకాయ తిన్న తర్వాత నీరు తాగితే లూజ్ మోషన్, డయేరియాను వ్యాధులని ఎదుర్కోవలసి ఉంటుంది. దోసకాయ తర్వాత నీరు తాగడం వల్ల శరీరంలోని pH స్థాయికి భంగం కలుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories