Health Tips: దాల్చిన చెక్క వారికి దివ్య ఔషధం.. ఎటువంటి మందు అవసరం లేదు..!

Diabetics Must Drink Cinnamon Water no Medicine Required
x

Health Tips: దాల్చిన చెక్క వారికి దివ్య ఔషధం.. ఎటువంటి మందు అవసరం లేదు..!

Highlights

Health Tips: దాల్చిన చెక్క వారికి దివ్య ఔషధం.. ఎటువంటి మందు అవసరం లేదు..!

Health Tips: దాల్చిన చెక్క ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక పోషకాలను అందిస్తుంది. మధుమేహంతో బాధపడే వారికి దాల్చిన చెక్క నీరు దివ్యౌషధం. దాల్చిన చెక్క మసాలా కాదు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు దాగి ఉంటాయి. నీరు, దాల్చినచెక్క కలయిక ఒక మంచి పానీయం. ఇది శరీరంలోని అన్ని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. దీని ప్రయోజనాలు ఇక్కడితో ముగియవు. దాల్చిన చెక్క నీరు శరీరంలో పెరిగే అవాంఛిత కొవ్వును కరిగిస్తుంది. దీంతో పాటు ఇది గుండెకు సంబంధించిన వ్యాధులను, అల్జీమర్స్ వంటి వ్యాధులను తొలగిస్తుంది.

దాల్చిన చెక్కలో ఉండే ఔషధ గుణాలు మధుమేహాన్ని నయం చేస్తాయి. ఇందులో ఉండే ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మధుమేహంతో సంబంధం ఉన్న ఇతర వ్యాధులను కూడా నయం చేస్తుంది. దాల్చిన చెక్క నీటిని తయారు చేయడానికి ఒక గిన్నెలో లీటరు నీటిని తీసుకోవాలి. అందులో ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్కను వేయాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. అందులో కొన్ని నిమ్మకాయ చుక్కలని పిండవచ్చు. మరుసటి రోజు దాహం వేసినప్పుడల్లా ఈ నీటిని తాగాలి.

మరొక పద్దతిలో దాల్చిన చెక్కను నీటిలో మరిగించి కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం కేవలం రెండు కప్పుల నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిలో దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ప్రతిరోజూ దీనిని తాగాలి. డయాబెటిస్‌లో మీరు ఖచ్చితంగా దీని ప్రయోజనం పొందుతారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories