Health Tips: మధుమేహ రోగులకి గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువ.. అందుకే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Diabetic patients have a high risk of heart attack thats why these precautions are mandatory
x

Health Tips: మధుమేహ రోగులకి గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువ.. అందుకే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Highlights

Health Tips: డయాబెటిస్ రోగులకి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది

Health Tips: డయాబెటిస్ రోగులకి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్ అసమతుల్యత వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీనివల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

రక్తంలో చక్కెర పెరుగుదల

ఎవరికైనా 30, 45 ఏళ్ల వయసులో మధుమేహం వచ్చిందంటే ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. అధిక రక్త చక్కెర అధిక రక్తపోటుకు కారణమవుతుంది. అధిక రక్తపోటు గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలి.

కొలెస్ట్రాల్ పెరగడం

40 ఏళ్ల వయస్సులో మనం స్వేచ్ఛగా తింటాము. మధుమేహం ఉన్నా చాలా మంది తమ ఆహారపు అలవాట్లలో పెద్దగా మార్పులు చేయరు. ఈ పరిస్థితిలో, నూనె మసాలాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల గుండెకి రక్తాన్ని తీసుకుపోయే నరాలలో కొవ్వు చేరి గుండెపోటుకి కారణం అవుతుంది.

ధూమపానం,ఒత్తిడి

30 ఏళ్లు పైబడిన వారు కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. దీనివల్ల రక్తంలో చక్కెర, రక్తపోటు రెండూ పెరుగుతాయి. ఈ పరిస్థితిలో ధూమపానం, మద్యం సేవించే అలవాటు పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం వేగంగా వ్యాపిస్తుంది.

గుండెపోటును నివారించాలంటే..

1. బ్లడ్ షుగర్‌ను వీలైనంత సాధారణంగా ఉంచుకోవాలి.

2. బరువును అదుపులో ఉంచుకోవాలి.

3. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

4. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories