Diabetes Patients: మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఈ 4 ఆహారాలు బెస్ట్..!

Diabetes Patients: మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఈ 4 ఆహారాలు బెస్ట్..!
Diabetes Patients: ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధి సర్వసాధారణంగా మారింది.
Diabetes Patients: ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధి సర్వసాధారణంగా మారింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. నిజానికి డయాబెటీస్ రోగులు రక్తంలో చక్కెర స్థాయి గురించి ఆందోళన పడుతారు. అది ఎక్కువగా పెరిగితే పెద్ద సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితిలో రోగులు కొన్ని ప్రత్యేక ఆహారాలని తీసుకోవాలి. అప్పుడు షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇతర వ్యాధుల ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
1. పాప్ కార్న్
ఆరోగ్యకరమైన చిరుతిండికి పాప్‌కార్న్ మంచి ఎంపిక. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది కడుపు సమస్యలను దూరం చేస్తుంది. డయాబెటీస్ పేషెంట్లు పాప్‌కార్న్ తినాలి.
2. పెరుగు
డయాబెటీస్ పేషెంట్లు తక్కువ కొవ్వు ఉన్న పెరుగును తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో పిండి పదార్థాలు ఉండవు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. పెరుగు తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీని కారణంగా మీరు మళ్లీ మళ్లీ తినకుండా ఉంటారు. ఈ విధంగా మీరు బరువు కూడా తగ్గుతారు.
3. గింజలు
వాల్ నట్స్, జీడిపప్పు, బాదం వంటి నట్స్ తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరగదు. ఈ గింజలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వాల్‌నట్‌లు, జీడిపప్పు, పిస్తా, బాదం మొదలైనవి తినాలి. అవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచవు. వీటిని తీసుకోవడం ద్వారా కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటి పోషకాలు శరీరంలోకి వెళ్తాయి. ఇవి అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
4. గుడ్లు
గుడ్లలో పిండి పదార్థాలు చాలా తక్కువ. దీని వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ అంతగా పెరగదు. ఉదయం లేదా సాయంత్రం ఆకలిని తీర్చుకోవడానికి మీరు ఒకటి లేదా రెండు ఉడికించిన గుడ్లు తినవచ్చు. గుడ్డు ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది
20 Aug 2022 2:54 AM GMTవైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMT