మధుమేహానికి తీసుకునే మందులు అల్జీమర్స్ ని దూరంగా ఉంచుతాయి.

మధుమేహానికి తీసుకునే మందులు అల్జీమర్స్ ని దూరంగా ఉంచుతాయి.
x
Highlights

మధుమేహానికి తీసుకునే మందులు అల్జీమర్స్ ని దూరంగా ఉంచుతాయి! టైప్ 2 డయాబెటీస్ (మధుమేహం) కి పేషెంట్స్ వాడే మందులతో అల్జీమర్స్ ను దూరంగా ఉంచొచ్చా? అంటే...

మధుమేహానికి తీసుకునే మందులు అల్జీమర్స్ ని దూరంగా ఉంచుతాయి!

టైప్ 2 డయాబెటీస్ (మధుమేహం) కి పేషెంట్స్ వాడే మందులతో అల్జీమర్స్ ను దూరంగా ఉంచొచ్చా? అంటే అవుననే చెబుతున్నాయి తాజా పరిశోధనలు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఈ విషయాన్ని వెల్లడించింది. మార్చి నెలలో డయాబెటీస్ కేర్ పేరుతొ ప్రచురించిన పరిశోధన పత్రంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.

సాధారణ గ్లూకోజ్ స్థాయిలు ఉన్న ప్రజలకు, ప్రి డయాబెటిస్ స్టేజ్ ఉన్నవారు లేదా టైపు 2 డయాబెటిస్ ఉన్నవారి మధ్య అల్జీమర్స్ కు సంబంధించిన తేడాలకు సంబంధించి చేసిన తొలి పరిశోధనగా దీనిని చెప్పారు. దీని ప్రకారం మధుమేహానికి మందులు వాడుతున్న వారిలో అల్జీమర్స్ దాదాపుగా కనిపించలేదని వివరించారు. పది సంవత్సరాల మెడికల్ రికార్డుల ఆధారంగా 900 మంది పై ఈ పరిశోధనలు చేసినట్టు చెప్పారు. ఇందులో 54 మంది డయాబెటీస్ తో బాధపడుతున్నవారు కానీ వైద్యం తీసుకొని వారు, 67 మంది మందులు వాడుతున్నవారు ఉన్నారు. అదేవిధంగా 530 మంది ఏవిధమైన మధుమేహం లేని వారు, 250 మంది ప్రి డయాబెటిక్ స్టేజి లో ఉన్నవారిపై ఈ పరిశోధనలు జరిపినట్టు వెల్లడించారు.

పరిశోధకులు వీరందరిలో ఉన్న వైవిధ్యాలను అనుసరించి.. అల్జీమర్స్ కు సంబంధించిన డేటా సేకరించారు. వీరికి మెదడుకు, వెన్నెముకకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. వాటిని సరిపోల్చారు.

వీటి ఆధారంగా డయాబెటీస్ కి వాడుతున్న మందులతో మెదడు కణాలు కొత్తగా ఉత్పన్నమవుతున్నాయని భావిస్తున్నారు. కానీ, ఇలా ఎందుకు జరుగుతుందన్న దానిపై మాత్రం ఇప్పటివరకూ ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ఈ విషయాన్ని నిర్థారించడానికి ఇంకా పరిశోధనలు సాగించాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories