Health Tips: డయాబెటీస్​ వల్ల గుండెకు, కిడ్నీలకు హాని జరుగుతుంది.. ఎలాగంటే..?

Diabetes causes Damage to the Heart and Kidneys Know how
x

Health Tips: డయాబెటీస్​ వల్ల గుండెకు, కిడ్నీలకు హాని జరుగుతుంది.. ఎలాగంటే..?

Highlights

Health Tips: భారతదేశంలో డయాబెటీస్​ పేషెంట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఇది ఒక దీర్ఘకాలిక సమస్య.

Health Tips: భారతదేశంలో డయాబెటీస్​ పేషెంట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఇది ఒక దీర్ఘకాలిక సమస్య. దీనివల్ల శరీరంలోని అవయవాల పనితీరు మందగిస్తుంది. అనేక ఇతర వ్యాధులు సంభవిస్తాయి. డయాబెటీస్​లో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి టైప్​ 1 జన్యు పరంగా వస్తుంది. టైప్​ 2 చెడు అలవాట్లు, కార్బోహైడ్రేట్స్​ ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించకపోతే ఊబకాయం, కిడ్నీ , గుండె జబ్బులు తలెత్తుతాయి. అది ఎలా జరుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

గుండె వ్యాధులు

వరల్డ్ జర్నల్ ఆఫ్ డయాబెటిస్ ప్రకారం డయాబెటిక్ రోగులు తరచుగా ఊబకాయం, అధిక రక్తపోటు, డైస్లిపిడెమియా వంటి గుండె సంబంధిత ప్రమాదాలను కలిగి ఉంటారు. ఒక వ్యక్తికి డయాబెటీస్​కు గురైతే భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా మధుమేహం వల్ల బ్రెయిన్ స్టోక్ సమస్య కూడా పెరుగుతుంది. అందువల్ల ప్రతిరోజూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని చెక్​ చేసుకోవడం అవసరం. దీనివల్ల భవిష్యత్​లో జరిగే అరోగ్య ప్రమాదలను తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడవచ్చు.

కిడ్నీ వ్యాధులు

అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ క్లినికల్ జర్నల్ ప్రకారం డయాబెటిక్ రోగులలో 40 శాతం మందికి కిడ్నీ సమస్యలు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్‌కు కారణమవుతుంది. డయాబెటీస్​ కిడ్నీలలోని చిన్న చిన్న రక్త నాళాలకు హాని కలిగిస్తుంది. ఇది రక్తంలోని మలినాలను వడకట్టే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే కిడ్నీలు ఫెయిల్​ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories