ఈ బీచ్ ప్రయాణం చాలా వింతగా ఉంటుంది!

ఈ బీచ్ ప్రయాణం చాలా వింతగా ఉంటుంది!
x
Highlights

ప్రయాణం చేయడం అంటే చాలా మందికి ఇష్టం వుండదు. కొంత మందికి చిరాకు కూడా. మరి కొందరు ప్రయాణం చేయలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి వారు ఎటువంటి...

ప్రయాణం చేయడం అంటే చాలా మందికి ఇష్టం వుండదు. కొంత మందికి చిరాకు కూడా. మరి కొందరు ప్రయాణం చేయలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి వారు ఎటువంటి చిరాకూ పడకుండా, సాఫీగా ప్రయాణం చేసే మార్గం ఒకటుంది. అక్కడికి వెళ్లి ఆ బీచ్ లో స్నానం చేస్తే.. మానసిక ఉల్లాసం వస్తుంది. ఎంతో ఆహ్లాదాన్నికలిగించే ఆ ప్రదేశం తమిళనాడు లోని, రామేశ్వరం దగ్గరలో వున్న ఓ చిన్న గ్రామం ధనుష్కోటి.

ghost town గా పిలిచే ఈ ఊళ్లో అందమైన బీచ్ వుంది. ఈ బీచ్ ప్రయాణం చాలా వింతగా అనిపిస్తుంది. ఈ మార్గంలో వెళుతుంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. ప్రయాణం అంటే చిరాకు పడేవాళైనా ఇక్కడ తీరాలను తాకే అలలు చూస్తూ ఎంత దూరమైనా వెళ్లడానికి ఇష్టపడతారు. ఈ మార్గం ప్రయాణికులకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

తీరాలను తాకే అలలు, అనైముడి కొండల నుంచి దిగివచ్చిన మేఘాలు చూడచక్కగా ఉంటాయి.ఈ బీచ్ కి వెళ్లాలంటే బెంగుళూరు నుంచి 600 కి.మి ప్రయాణం చేయాలి. రామేశ్వరం నుంచి ధనుష్కోటికి 12 కి.మీ. ప్రయాణం ఉంటుంది. అక్కడి నుంచి ఓ ప్రత్యేకమైన వెహికల్ లో మాత్రమే ప్రయాణం చేయవలసి ఉంటుంది. అదేంటంటే ఇసుకలో కూడా ఈజీగా వెళ్లే విధంగా తయారుచేసిన జీప్. రెండు గంటలపాటు ఈ జీప్ లో చేసే జర్నీకి అందరూ ఫిదా అవ్వాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories