Health Tips: మెడ నలుపుగా మారుతోందా.. పచ్చి బొప్పాయితో తెల్లగా మార్చేయండి..!

Dark Neck Whitening Tips and Make Raw Papaya Neck Tanning Removal Mask with Simple Tips
x

Health Tips: మెడ నలుపుగా మారుతోందా.. పచ్చి బొప్పాయితో తెల్లగా మార్చేయండి..!

Highlights

Skin Care Tips: ప్రతి ఒక్కరూ తమ ముఖం అందంగా కనిపించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, శరీరంలోని కొన్ని భాగాల సంరక్షణకు శ్రద్ధ చూపరు. వాటిలో ఒకటి మెడ. మెడను వెనుక శుభ్రం చేయడం కొంచెం కష్టం. కాబట్టి మెడ చాలా అసహ్యంగా కనిపిస్తుంది.

Raw Papaya Neck Tanning Removal Mask: ప్రతి ఒక్కరూ తమ ముఖం అందంగా కనిపించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, శరీరంలోని కొన్ని భాగాల సంరక్షణకు శ్రద్ధ చూపరు. వాటిలో ఒకటి మెడ. మెడను వెనుక శుభ్రం చేయడం కొంచెం కష్టం. కాబట్టి మెడ చాలా అసహ్యంగా కనిపిస్తుంది. దీని కారణంగా ఇది మీ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, ఈ రోజు మేం మీ కోసం పచ్చి బొప్పాయితో నెక్ టానింగ్ రిమూవల్ మాస్క్‌ని ఎలా తయారుచేయాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పబోతున్నాం. పచ్చి బొప్పాయిలో మీ ఛాయను మెరుగుపరిచే అనేక గుణాలు ఉన్నాయి. దీనితో పాటు, ఇది డెడ్ స్కిన్ తొలగించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, టానింగ్ కూడా తొలగిపోతుంది. తద్వారా మీ మెడలోని నలుపు స్పష్టంగా మారుతుంది. కాబట్టి ఈ నెక్ టానింగ్ రిమావల్ మాస్క్‌ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

పచ్చి బొప్పాయితో నెక్ టానింగ్ రిమూవల్ మాస్క్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..

పచ్చి బొప్పాయి

1 tsp పెరుగు

1 tsp రోజ్ వాటర్

పచ్చి బొప్పాయి నెక్ టానింగ్ రిమూవల్ మాస్క్ ఎలా తయారు చేయాలి?

పచ్చి బొప్పాయి నెక్ టానింగ్ రిమూవల్ మాస్క్ చేయడానికి, ముందుగా బొప్పాయిని తీసుకోండి.

తర్వాత పొట్టు తీసి బాగా మెత్తగా చేసి గిన్నెలో వేయాలి.

ఆ తరువాత, ఈ గుజ్జులో 1 టీస్పూన్ పెరుగు, 1 టీస్పూన్ రోజ్ వాటర్ కలపాలి.

తర్వాత ఈ మూడింటిని బాగా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి.

దీంతో పచ్చి బొప్పాయి నెక్ టానింగ్ రిమూవల్ మాస్క్ తయారైనట్లే.

పచ్చి బొప్పాయి నెక్ టానింగ్ రిమూవల్ మాస్క్ ఎలా ఉపయోగించాలి?

పచ్చి బొప్పాయి నెక్ టానింగ్ రిమూవల్ మాస్క్ తీసుకుని మీ మెడపై బాగా అప్లై చేయండి.

ఆ తర్వాత మెడపై 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

ఆ తరువాత, మీ మెడను సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.

ఈ మాస్క్ సహాయంతో మెడపై పేరుకున్న మురికి సులభంగా తొలగిపోతుంది.

(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. దీనిని పాటించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి.)

Show Full Article
Print Article
Next Story
More Stories