Health Tips: బరువు తగ్గిస్తుంది.. ఇమ్యూనిటీ పెంచుతుంది.. ఇది ఒక్కటి చాలు..!

Cumin Seeds Remove Digestive Problems
x

Health Tips: బరువు తగ్గిస్తుంది.. ఇమ్యూనిటీ పెంచుతుంది.. ఇది ఒక్కటి చాలు..!

Highlights

Health Tips: బరువు పెరగడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు.

Health Tips: బరువు పెరగడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదు. ఈ రోజు మీకు ఒక ప్రత్యేక పానీయాన్ని పరిచయం చేస్తున్నాం. ఇది మీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర మిక్స్ చేసి ఖాళీ కడుపుతో తాగాలి.

జీలకర్రలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీర్ఘకాలిక ఊబకాయం, ఛాతిలో మంట, హృదయ సంబంధ వ్యాధులకు మంచి మందులా పనిచేస్తుంది. జీలకర్ర నీరు జీర్ణ ప్రయోజనాలకు కూడా ప్రసిద్ది చెందింది. LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన, స్పష్టమైన చర్మాన్ని పొందడానికి గొప్ప మార్గం. ఊబకాయం నియంత్రించడానికి, ఫ్లాట్ స్టమక్ పొందడానికి ఈ పానీయం చక్కగా పనిచేస్తుంది.

జీలకర్రలో ఇనుము, కాల్షియం, జింక్, భాస్వరం ఉన్నాయి. ఇవి యూరిక్ ఆమ్లాన్ని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. పొట్టను తగ్గించడానికి వాము నీరు చాలా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ వాము వేసి మరిగించాలి. తర్వాత గోరు వెచ్చని నీటిని తాగాలి. అవసరమైతే పగటిపూట కూడా ఈ నీటిని తాగవచ్చు. త్వరలో మంచి ఫలితాలను చూస్తారు. అయితే ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories